AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘చిట్టిబాబు’గా ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరోలో దాగి ఉన్న అద్భుతమైన నటుడిని బయటకు తీసి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు సుకుమార్. ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.

అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్
Rangasthalam
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2026 | 11:34 AM

Share

రామ్ చరణ్ కెరీర్ బిగెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన సినిమా రంగస్థలం. మగధీర తర్వాత చరణ్‌కు ఆ రేంజ్ హిట్ ఇచ్చిన రంగస్థలం సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఈ మూవీలో ఒక చెవ్వు వినిపించని వాడి పాత్రలో చరణ్ నటన అద్బుతమనే చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు  ఈ సినిమాలో నటించిన అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రంగమత్త పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. ఈ పాత్రలో అనసూయ నటించిన విషయం తెలిసిందే.

శ్రీదేవితోనే ప్రాబ్లమ్ .. ఆమె ఉంటే సినిమా చేయనున్న హీరోయిన్.. కానీ చివరకు

రంగస్థలం రంగమ్మత్త పాత్రతో అనసూయ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ నటించిన రంగమత్త పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? సుకుమార్ ముందుగా రంగమత్త పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ ను సంప్రదించారట. ఆ నటి ఎవరో కాదు రాశి. సీనియర్ హీరోయిన్ రాశి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు, సీరియల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒకప్పుడు రాశి హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే.. ఆయన మంచి ఫ్యాన్ బేస్ ఉండేది.

అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

కాగా రంగస్థలం సినిమాలో రంగమత్త పాత్రకు సుకుమార్ ముందుగా రాశిని ఎంపిక చేశారట. ఈ విషయాన్నీ రాశినే స్వయంగా తెలిపింది. సుకుమార్ రంగమత్త పాత్ర కోసం సంప్రదించినప్పుడు. రంగమత్త పాత్రలో ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేస్తారో లేదో అని రిజెక్ట్ చేసినట్లు  తెలిపారు రాశి. రంగమత్త రోల్ రగ్గుడ్‌గా ఉంటుందని, నేను సింపతీ క్యారెక్టర్‌లకు స్యూట్ అవుతానని.. దాంతో సుకుమార్ సర్‌కు నేను ఆ పాత్ర చేయలేనని చెప్పినట్లు రాశి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె ఆ పాత్ర చేసి ఉంటే ఇంకా బాగుండేదని.. ఆమె ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీగా ఉండేవారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చైనాలో వందరోజులు ఆడిన తొలి తెలుగు సినిమా.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ

Rashi

Rashi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us