
టాలీవుడ్ హీరో రానా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. రానా టాక్ షో పేరుతో వస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీస్ పాల్గొని సందడి చేశారు. అతి తక్కువ సమయంలోనే తనదైన హోస్టింగ్ టాలెంట్ తో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనే అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్నాడు రానా. ఇప్పటివరకు అడియన్స్ చూసిన టాక్ షోలకు విభిన్నంగా ఈ టాక్ షో ప్లాన్ చేశాడు రానా. సినిమా ముచ్చట్లు కాకుండా పర్సనల్ లైఫ్ విషయాలను రాబడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఈ షోలో రానా, సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరూ హీరోయిన్ శ్రీలీలను ఓ ఆటాడుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిద్ధు కామెడీ టైమింగ్ చూసి షాకయ్యింది శ్రీలీల. ఇక ఆ తర్వాత రానా తన కజిన్స్ తో ఓ ఎపిసోడ్ చేశాడు.
ఈ ఎపిసోడ్ లో సురేష్ బాబు కూతురు.. రానా చెల్లెలు మాళవిక, రానా భార్య మిహిక హైలెట్ అయ్యారు. ఇక తన మరదలు మాళవిక పై మిహిక సెటైర్స్ వేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇందులో రానా, మిహిక, నాగచైతన్య, మాళవిక కంటిన్యూగా మాట్లాడుతుంటే.. సుమంత్, మరొకరు సైలెంట్ గా ఉండిపోయారు. నాగచైతన్యను మాళవిక పదే పదే బావా బావా అని పిలుస్తున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. బావ, మరదలు బాండింగ్ ఎంత క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
The way she calling bava 🥰🖤#NagaChaithanya #ranadaggubati pic.twitter.com/viG580y29i
— Mr Ravi (@Ravi25365997) December 10, 2024
చైతన్యను మాళవిక పదే పదే బావ అని పిలుస్తుండడం.. అలాగే తన మరదలిని చైతన్య ఆటపట్టించడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందనేది అర్థమవుతుంది. ఇక మాళవిక చైతన్యను బావా బావా అని పిలుస్తున్న విధానం ఎంతో క్యూట్ గా ఉందంటూ ఆ వీడియోస్ షేర్ చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో చైతన్య ఎంతో ఓపెన్ అయి మాట్లాడాడు.
#MalavikaPotluriDaggubati ఏంట్రా ఈ అమ్మాయి చైతు బాబు నీ బావ అని పిలుస్తున్న విధానం ఇంత బాగుంది …😍🤌@chay_akkineni ఎంత ముద్దుగా పిలుస్తోంది అన్న…💓#NagaChaitanya #NagaChaithanya #ranadaggubati pic.twitter.com/uQxysQbdl6
— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) December 10, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.