Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట గురించి హింట్ ఇచ్చిన తమన్.. ఖుషీ అవుతున్న మహేష్ ఫ్యాన్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీతగోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సర్కారు వారి పాట మూవీతో మొదటి సారి మహేష్ సరసన కనిపించనుంది కీర్తి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ఎప్పుడెప్పుడు ఈసినిమాను చూద్దామా అని మహేష్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పూరిజగన్నాథ్ సినిమా స్టైల్ లో ఉంటుందని ఇప్పటికే మహేష్ హింట్ ఇచ్చాడు. దాంతో అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతుంది.
ఇదిలా ఉంటే ఇటీవలే మహేష్ మోకాలి సర్జరీ కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే మహేష్ తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. క బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని మొదటి నుంచి టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. అనుకోని కారణాల వల్ల సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్నీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే మ్యూజిక్ రెడీ అవుతుందని తమన్ ఇప్పటికే చెప్తూ వస్తున్నారు. సంక్రాంతి నుంచి సర్కారు వారి పాట అప్డేస్ట్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి కానుకగా మొదటి పాటను విడుదల చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా తమన్ ట్విట్టర్ వేదికగా ”మేము మీ మాటలు విన్నాం.. మేము వింటున్నాం.. అతి త్వరలో మీరు మా నుండి వింటారు. పరశురామ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సూపర్ బెస్ట్ ఇస్తున్నారు. దీని కోసం మా టీమ్ మొత్తం చాలా కష్టపడుతోంది” అని రాసుకొచ్చాడు తమన్
We heard U and We have been Hearing U ?? Very soon u will be hearing from Us ❤️??#SarkaruVaariPaata #SarkaruVaariPaataMusic ♥️? @ParasuramPetla Has done super best for our #SuperStar @urstrulyMahesh gaaru Our Whole team Working very hard for this ☺️?@MythriOfficial ? pic.twitter.com/QQLe0ikEXv
— thaman S (@MusicThaman) January 6, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :