Rajini Kanth: చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తలైవాకి ఘన స్వాగతం పలికిన అభిమానులు..

సూపర్ స్టార్ రజినీ కాంత్... చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన సాధారణ హెల్త్ చెకప్ కోసం జూన్ 19న ప్రత్యేక అనుమతి అమెరికా వెళ్లారు.

Rajini Kanth: చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.. తలైవాకి ఘన స్వాగతం పలికిన అభిమానులు..
Rajini Kanth

Edited By: Ram Naramaneni

Updated on: Jul 09, 2021 | 8:34 PM

సూపర్ స్టార్ రజినీ కాంత్… చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన సాధారణ హెల్త్ చెకప్ కోసం జూన్ 19న ప్రత్యేక అనుమతి అమెరికా వెళ్లారు. తలైవా… 2016 మేలో కిడ్నీ ట్రాన్స్‏ప్లాంట్ సర్జరీని అమెరికాలో చేయించుకున్నారు. దీంతో ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ కోసం అక్కడి వెళ్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా రజినీ అమెరికాకు వెళ్లారు. అక్కడ మయో క్లినికల్ ఆసుపత్రిలోని వైద్యులు తలైవాకి అన్ని పరీక్షలు చేసి.. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. దీంతో ఈరోజు రజినీ కాంత్ తిరిగి చెన్నై ఆసుపత్రికి చేరారు. ఈరోజు మధ్యాహ్నాం చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు సూపర్ స్టార్. ఈ సందర్బంగా రజినీ కాంత్‏కు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

Rajini

ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉండగా..నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.  ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం. ఇందులో తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత రజినీ ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

వీడియో…

Also Read: YCP MP Complaint: తెలంగాణ సర్కార్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది.. చర్యలు తీసుకోండి.. కేంద్రానికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

Aashaadha Amavasya 2021: అషాడ అమావాస్య శుభ ముహుర్తం.. ఈరోజు ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..

Visakha Steel Plant Privatization: ఆ శక్తి ఒక్క వెంకయ్య నాయుడికే ఉంది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

Jyotiraditya Scindia: కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన కొంతసేపటికే.. సింధియా ఫేస్‌బుక్ హ్యాక్.. పాత వీడియో కలకలం..