Mahesh Babu: స్టైలీష్ అండ్ కూల్ లుక్‏లో సూపర్ స్టార్.. మహేష్ బాబు లేటేస్ట్ ఫోటో వైరల్..

| Edited By: seoteam.veegam

May 18, 2023 | 3:41 PM

తాజాగా మరోసారి ఫ్యాన్స్‏కు ఆకట్టుకున్నారు. ఫుల్ క్రాఫ్‏తో ట్రెండీ స్టైల్ గ్లాసెస్ తో స్టైలీష్ అండ్ కూల్‏గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులే కాకుండా.. సినీ ప్రియులు సైతం ఈ లుక్ చూసి.. వయసు పెరుగుతున్నా మరింత అందంగా తయారవుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Babu: స్టైలీష్ అండ్ కూల్ లుక్‏లో సూపర్ స్టార్.. మహేష్ బాబు లేటేస్ట్ ఫోటో వైరల్..
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‏లో ఉన్న సంగతి తెలిసిందే. విశ్రాంతి మూడ్‏లో ఇలా ఉన్నానంటూ సూపర్ స్టార్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ నెలాఖరులో ఇండియాకు తిరిగిరానున్నారు. అయితే మహేష్ లుక్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ స్టైలీష్ లుక్స్‏తో అభిమానులను ఫిదా చేస్తుంటారు. తాజాగా మరోసారి ఫ్యాన్స్‏కు ఆకట్టుకున్నారు. ఫుల్ క్రాఫ్‏తో ట్రెండీ స్టైల్ గ్లాసెస్ తో స్టైలీష్ అండ్ కూల్‏గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులే కాకుండా.. సినీ ప్రియులు సైతం ఈ లుక్ చూసి.. వయసు పెరుగుతున్నా మరింత అందంగా తయారవుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… ప్రస్తుతం మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమా టైటిల్ అనౌన్మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కొద్దిరోజులుగా ఈ సినిమా టైటిల్ గుంటూరు కారం అని వినిపించగా.. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. అమరావతికి అటు ఇటూ అనే పేరును చిత్రబృందం ఫిక్స్ అయ్యిందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక త్రివిక్రమ్ కు ‘అ’ అక్షరంతో టైటిల్ పెట్టడం సెంటిమెంట్ కాబట్టి.. అమరావతికి అటు ఇటూ అనే టైటిల్ మాత్రం ఫిక్స్ అంటున్నారు. చూడాలి మరీ చివరకు ఏ టైటిల్ నిర్ణయిస్తారనేది. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.