Sarkaru Vaari Paata: ఈ రెండేళ్లలో చాలా జ‌రిగాయి.. నాకు చాలా ద‌గ్గరైన వాళ్లు కొంత మంది దూర‌మ‌య్యారు..

అభిమానుల‌ను ప్రత్యేక్షంగా క‌లుసుకుని రెండేళ్లు అవుతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) అన్నారు. మహేష్ బాబు, కీర్తి సురేష్(Keerthi suresh) జంటగా నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

Sarkaru Vaari Paata: ఈ రెండేళ్లలో చాలా జ‌రిగాయి.. నాకు చాలా ద‌గ్గరైన వాళ్లు కొంత మంది దూర‌మ‌య్యారు..
Mahesh Babu
Follow us

|

Updated on: May 07, 2022 | 11:52 PM

అభిమానుల‌ను ప్రత్యేక్షంగా క‌లుసుకుని రెండేళ్లు అవుతుందని సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) అన్నారు. మహేష్ బాబు, కీర్తి సురేష్(Keerthi suresh) జంటగా నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌కు వ‌చ్చిన ప్రతి ఒక్కరికీ మహేష్ థాంక్స్‌ చెప్పారు. డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాటలో తన క్యారెక్టర్‌ని కొత్తగా డిజైన్ చేశారన్నారు. “నా లుక్‌, డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్‌, బాడీ లాంగ్వేజ్ ఇలా టోటల్‌గా ప‌ర‌శురామ్ డిజైన్ చేశాడు. చాలా ఎంజాయ్ చేస్తూ వ‌ర్క్ చేశాను. కొన్ని సీన్స్‌లో యాక్ట్ చేసే స‌మ‌యంలో పోకిరి రోజులు గుర్తుకు వ‌చ్చాయి.” అని మహేష్‌ బాబు చెప్పారు. క‌థ విని ఓకే చేసిన‌ప్పుడు .. ప‌ర‌శురామ్‌గారు ఇంటికెళ్లిన రెండు, మూడు గంట‌ల త‌ర్వాత నాకొక మెసేజ్ పెట్టాడని మహేష్‌ అన్నారు. ‘థాంక్యూ సార్‌.. ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవుదామ‌ని బండెక్కి హైద‌రాబాద్ వ‌చ్చాను. మీరు నాకు ఆప‌ర్చ్యునిటీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈ సినిమాను ఎలా తీస్తానో..ఇరగదీసేస్తాను’ అని మెసేజ్ పెట్టారని గుర్తు చేశారు.

‘‘ఈరోజు నాన్నగారి అభిమానుల‌కు, నా అభిమానుల‌కు ప‌ర‌శురామ్‌గారు ఫేవ‌రేట్ డైరెక్టర్ అయిపోయారు. స‌ర్కారు వారి పాట చిత్రాన్ని నాకు ఇచ్చినందుకు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌’’ అని సూపర్ స్టార్ మహేష్ అన్నారు. తనకు, త‌మ‌న్‌కు చాలా గ్యాప్ వ‌చ్చిందని… క‌ళావ‌తి పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలుసుని మహేష్ గుర్తు చేశారు. త‌న మ్యూజిక్ ఇప్పుడు యూత్‌కి, మాస్ స‌హా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుందన్నారు. త‌మ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి తును పెద్ద ఫ్యాన్‌ అని చెప్పారు. ఈ సినిమా కోసం కష్టపడిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. “ఈ రెండేళ్లలో చాలా జ‌రిగాయి. చాలా మారాయి. నాకు చాలా ద‌గ్గరైన వాళ్లు కొంత మంది దూర‌మ‌య్యారు. ఏది జ‌రిగినా మీ అభిమానం మాత్రం మార‌లేదు. ఇది చాలు.. ధైర్యంగా ముందుకు వెళ్లిపోవటానికి.” అని అన్నారు.