Krishna Statue: కృష్ణ విగ్రహావిష్కరణకు సొంత ఊరు సిద్దం.. హాజరుకానున్న కుటుంబ సభ్యులు..

| Edited By: Surya Kala

Jul 30, 2023 | 11:22 AM

సినిమాల్లోకి వెళ్ళి హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత కూడా హీరో కృష్ణ సొంత ఊరుకి వస్తుండేవారు. బుర్రిపాలెంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కృష్ణ తల్లి పేరు నాగరత్నమ్మ. ఆమె పేరుమీదే పాఠశాల ఉంది‌. గీతా మందిరం, బస్టాఫ్, ఆలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. స్వ గ్రామంలో సూపర్ స్టార్ గుర్తుగా ఆయన అభిమాన సంఘం విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్ధం చేశారు.

Krishna Statue: కృష్ణ విగ్రహావిష్కరణకు సొంత ఊరు సిద్దం.. హాజరుకానున్న కుటుంబ సభ్యులు..
Super Star Krishna
Follow us on

చలన చిత్ర పరిశ్రమలో చెరగని సంతకం సూపర్ స్టార్ కృష్ణ. సినీ హీరో కృష్ణ గురించి తెలియని వారుండరు. అత్యధిక సినిమాల్లో హీరోగా నటించి రికార్డు సృష్టించారు. అయన సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెం. బుర్రిపాలెం బుల్లోడుగా కృష్ణకి మరో పేరుంది. ఆయనకి బుర్రిపాలెంపై ప్రత్యేక మమకారం ఉండేది‌. సినిమాల్లోకి వెళ్ళి హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత కూడా సొంత ఊరుకి వస్తుండేవారు. ఇప్పటికీ గ్రామంలో మూడు అంతస్తుల భవనం ఉంది. కృష్ణ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి ఉపయోగించుకుంటారు. అలాగే బుర్రిపాలెంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కృష్ణ తల్లి పేరు నాగరత్నమ్మ. ఆమె పేరుమీదే పాఠశాల ఉంది‌. గీతా మందిరం, బస్టాఫ్, ఆలయం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

అయితే ఆయన గత ఏడాది నవంబర్ 15న కన్నుమూశారు. ఆయన చనిపోయిన తర్వాత కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వ గ్రామంలో సూపర్ స్టార్ గుర్తుగా ఆయన అభిమాన సంఘం విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్ధం చేశారు. కృష్ణ విగ్రహాన్ని తెనాలికి చెందిన సూర్య శిల్ప శాలలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్దమయ్యారు. అయితే గత మూడు నెలల నుండి విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ వస్తుంది.

ఎట్టకేలకు వచ్చే నెలలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు సిద్దమయ్యారు. ఆగష్టు 5 తేదిన బుర్రిపాలెంలో కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆదిశేషగిరిరావు తెలిపారు. విజయవాడ నుండి బుర్రిపాలెం వరకూ ర్యాలీ నిర్వహిస్తామని అభిమాన సంఘం నాయకులు చెప్పారు. సినీ రాజకీయ ప్రముఖులు బుర్రిపాలెం గ్రామానికి తరలిరానున్నారు.

ఇవి కూడా చదవండి

కృష్ణ విగ్రహావిష్కరణకు సొంత ఊరు సిద్దమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన కుటుంబ సభ్యులందరూ గ్రామానికి వస్తారని స్థానికులు తెలిపారు.‌ కృష్ణ పుట్టిన రోజైన మే 31న విగ్రహావిష్కరణ చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. వచ్చే నెలలో విగ్రహావిష్కరణ ఉండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..