Sarkaru Vaari Paata : జెట్ స్పీడ్‌లో ‘సర్కారు వారి పాట’ షూటింగ్.. అభిమానులు ఫుల్ ఖుష్
సూపర్ స్టార్ మహేష్ బాబు జోరు పెంచారు చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కు అరిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు...

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు జోరు పెంచారు చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి ఫ్యాన్స్‌కు అరిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో నెంబర్ వన్‌గా ఉన్న మహేష్ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ కొట్టాడని రెడీ అయ్యారు. గీతగోవిందం సినిమాతో మంచి హిట్ అందుకున్న పరశురామ్ మహేష్‌ను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మొదటిసారి సూపర్ స్టార్‌తో జతకడుతుంది మహానటి కీర్తిసురేష్. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ యూట్యూబ్ రికార్డ్స్‌ను తన ఖాతాలో ఎప్పుడో వేసుకుంది ఈ మూవీ. ఇక సరిలేరు సినిమా తర్వాత సర్కారువారి పాట కోసం ఫ్యాన్స్ యమా వెయిటింగ్. అది అర్థం చేసుకున్నారు కాబట్టే, పోస్ట్ కోవిడ్ సిట్చువేషన్‌లోనూ షూటింగ్ ఇలా మొదలుపెట్టారో లేదో, అలా చకచకా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు సూపర్‌స్టార్. ఆల్రెడీ దుబాయ్ షూట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు గోవా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని హైదరాబాద్ రిటర్న్ అయ్యారు మహేష్. అక్కడ మాసివ్ ఫైట్‌తో పాటు రెండు, మూడు రోజులు కీ సీన్స్ కూడా షూట్ చేశారు. ఆ అలసటను జస్ట్ త్రీ డేస్‌లో ఓవర్‌కమ్ అవుతారట ఘట్టమనేని స్టార్.
ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో నెల రోజుల పాటు స్పెషల్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు పరశురామ్. ఈ షెడ్యూల్లోనూ కీ ఆర్టిస్టులందరూ పార్టిసిపేట్ చేస్తారు. అక్టోబర్‌లో జరిగే ఫారిన్ షెడ్యూల్‌తో నియర్లీ 75 పర్సెంట్ షూట్ కంప్లీట్ అవుతుంది. 2022 జనవరి 13న రిలీజ్‌కి రెడీ కావాలంటే ఆ మాత్రం ప్లానింగ్, పర్ఫెక్షన్ ఉండాల్సిందే… ఈ స్పీడ్ చూసి ‘అది మా హీరో హార్డ్ వర్కర్ అంటే ‘ అని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అంతే కాదు రాత్రి పడుకునేటప్పుడు సార్‌కి దిష్టి తీయడం మర్చిపోకండి మేడమ్ అని నమృతకు రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bandla Ganesh: మీరు బుక్ చేసుకొండి.. నేను పర్మిషన్ ఇస్తా.. ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..
Ariyana: అరియానా న్యూలుక్ చూసి కంగుతిన్న నెటిజన్స్.. అలా చూడలేమంటూ కామెంట్స్..
Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..




