Pushpa2: సుకుమార్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
ప్రమోషన్లకు ఒకటీ, రెండు రోజులు హీరోలు సుడిగాలి పర్యటనలు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, అదేదో ఉద్యమంలా గ్రౌండ్‌లో దిగడం.. నాన్‌స్టాప్‌గా దేశమంతా తిరగడం మామూలు విషయం కాదుగా... ఐకాన్ స్టార్ ని చూసి చాలా మంది ఈ విషయంలో ఇన్‌స్పయిర్ కావాల్సిందేనని మాట్లాడుకుంటున్నారు.
చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ… “నేను బన్నీని ఆర్య నుండి చూస్తున్నాను. తను ఎలా ఎదుగుతున్నాడు చూస్తూనే వచ్చాను. తనని వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా చూసాను. ఈ పుష్ప అనే సినిమా ఇలా వచ్చింది అంటే దానికి కారణం కేవలం నాకు బండికి ఉన్న ఒక బాండింగ్ కారణంగానే. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఎంతో కష్టపడతాడు. అది ఎంత చిన్నదైనా సరే చాలా శ్రద్ధతో చేస్తాడు. కేవలం నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర పూర్తి కథ లేదు. నువ్వు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు నీకోసం నేను ఏమైనా చేసేయొచ్చు అనిపించింది. మిగతావారు అంతా చెప్పినట్లు బన్నీ సెట్స్ లో అందర్నీ కలిపి ఒక స్థాయిలోకి తీసుకుని వెళ్లి కూర్చోబెడతాడు. దానితో అందరికీ అదే స్థాయిలో పనిచేయాలని అనిపిస్తుంది. అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మేము మంచి ఆట ఆడటానికి సరైన గ్రౌండ్ ఇచ్చారు. పుష్ప ను రెండు భాగాలుగా చేయడానికి ముఖ్య కారణం చెర్రీ గారు. అలాగే చిత్రం కోసం సెట్స్ లో కష్టపడి పనిచేసిన రష్మిక, డిఓపి అందరికీ ధన్యవాదములు. రష్మిక గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. తను ప్రతి ఎక్స్ప్రెషన్ ఇంకా ఎమోషన్ను చాలా బాగా క్యారీ చేసింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కి ధన్యవాదాలు. క్లైమాక్స్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా ఎంతో హై ఉండబోతుంది. శ్రీలీల డాన్స్ మూవ్స్ చాలా బాగా చేసింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడ్డారు” అంటూ ముగించారు.