Mahesh Babu: ఆ సినిమా 100 సార్లు చూసుంటాను.. వైరలవుతున్న సుధీర్ బాబు, మహేష్ ఫోన్ కాల్ ఆడియో..
ఈ చిత్రాన్ని జూన్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.ఈ క్రమంలోనే సుధీర్ బాబు సినిమా కోసం మహేష్ ఓ ఆడియో ఇంట్రాక్షన్ లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన హరోంహర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ కు కాల్ చేసిన మాట్లాడిన ఆడియోను ప్లే చేశారు సుధీర్ బాబు. ఆ కాల్ లో పలు ఆసక్తికర విషయాలను అడగ్గా మహేష్ ఆన్సర్ ఇచ్చారు.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ హరోం హర.. ఇందులో మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.ఈ క్రమంలోనే సుధీర్ బాబు సినిమా కోసం మహేష్ ఓ ఆడియో ఇంట్రాక్షన్ లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన హరోంహర ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ కు కాల్ చేసిన మాట్లాడిన ఆడియోను ప్లే చేశారు సుధీర్ బాబు. ఆ కాల్ లో పలు ఆసక్తికర విషయాలను అడగ్గా మహేష్ ఆన్సర్ ఇచ్చారు.
సుదీర్ బాబు: సినిమాల్లో మొదటిసారి గన్స్ ఉపయోగించినప్పుడు ఎలా అనిపించింది..?
మహేష్ బాబు: గన్స్ ఉపయోగించడం పై నేను స్పెషల్ ట్రైనింగ్ తీసుకోలేదు. టక్కరి దొంగ సినిమాలో ఎక్కువగా గన్స్ వాడాం. ఆ సినిమా నాకు చాలా స్పెషల్.
సుధీర్ బాబు: గన్స్ ను చూపించిన సినిమాల్లో నీకు నచ్చిన మూవీ ఏది.? మహేష్ బాబు: నాన్న గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు. ఆ సినిమాను వందసార్లు చూసుంటాను. అది నాకు చాలా ఇష్టమైన మూవీ.
సుధీర్ బాబు: హరోంహర సినిమాలో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది..?
మహేష్ బాబు: టైటిల్ సాంగ్ చాలా నచ్చింది. ఆ పాట వినగానే నేను నీకు మెసేజ్ కూడా చేశాను.
సుధీర్ బాబు: హరోంహర ట్రైలర్ లో నీకు నచ్చిందేంటీ..?
మహేష్ బాబు: నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది.
సుధీర్ బాబు: నువ్వు నటించిన నిజం సినిమా గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు గుర్తున్నాయా..?
మహేష్ బాబు: నాకు చాలా నచ్చిన సినిమా అది. అలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ తేజకు థాంక్స్ చెప్పాలి. నిజం చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోయే రాబోయే ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.