వర్జినిటీ అనేది ఒక్కరాత్రిలోపోతుంది.. అది ముఖ్యం కాదు..! అంతమాటనేసిందేంటీ..!!
కొంతమంది హీరోయిన్స్ చేసే కామెంట్స్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంటూ ఉంటాయి. కొంతమంది హీరోయిన్స్ సినిమాలు సోషల్ మీడియాతో పాటు కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. కాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకూ ఆమె ఎవరంటే...

హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. నెట్టింట తమ అందచందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నారు అందాల భామలు. ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే.. సోషల్ మీడియాలో వయ్యారాలతో కవ్విస్తున్నారు. మరికొంతమంది మాత్రం దీనికి రివర్స్ వివాదాలతో పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న కొందరు లేనిపోని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. కన్యత్వం పై స్టార్ హీరోయిన్ ఊహించని కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అంతే కాదు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆమె ఎవరంటే..
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..
ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ ప్రియాంక చోప్రా. ఈ చిన్నది బాలీవుడ్ లో చాలా ఫేమస్. ఎన్నో సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్ళింది . ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ సినిమా రీసెంట్ గా విడుదలైంది. ప్రస్తుతం ప్రియాంక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక ఇటీవలే ఇండియాకు వచ్చింది.
ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. చాలా మంది మగాళ్లు తమకు కాబోయే భార్య వర్జిన్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ వర్జిన్ అనేది అంత ముఖ్యమైనది కాదు. వర్జినిటీ అనేది ఒక్క రాత్రిలో పోతుంది. దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు. అర్థం చేసుకునే అమ్మాయి మనకు భార్యగా రావాలి అని కోరుకోవాలి. మనకు నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మితే అతని కోసం ఏదైనా చేస్తుంది. అయితే కలిసిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు. దానికి అదృష్టం కూడా ఉండాలి. అది వర్కౌట్ అవ్వకపోతే వేరొకరిని పెళ్లి చేసుకుంటాం.. అంతే కానీ వర్జినిటీ గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




