
సినిమా ఇండస్ట్రీలోకి కొంతమంది క్రికెటర్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హరిభజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే శ్రీశాంత్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కూడా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ధోని యాడ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నిర్మాతగా మారి సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ధోని బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఇంతకూ ఆ స్టార్ క్రికెటర్ ఎవరంటే..
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా తమిళ సినిమా ద్వారా నటుడిగా అరంగేట్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని లోగన్ దర్శకత్వం వహిస్తుండగా, డ్రీమ్ నైట్ స్టోరీస్ బ్యానర్‌పై శ్రవణ కుమార్ నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రైనా కీలక పాత్రలో కనిపించనున్నాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో అనౌన్స్ చేశారు. ఇందులో క్రికెటర్ శివమ్ దూబే నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించాడు.
రైనా, ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో తన కుటుంబంతో ఉంటూ, వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రైనా, “చిన్న తలా”గా తమిళనాడులో విశేష అభిమానులను సంపాదించాడు. ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్ వంటి ఇతర క్రికెటర్లు కూడా గతంలో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. రైనాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. రైనాను మిస్టర్ ఐపీఎల్ అని పిలుస్తుంటారు ఆయన అభిమానులు. మరి రైనా ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి