AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీకర్లు పగిలిపోవడంకాదు.. థియేటర్లు తగలబడిపోతాయ్..! తమన్ ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు మావ

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమన్ . సినిమా ఏదైనా సరే తమన్ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక మాస్ సినిమాలకు తమన్ అందించే సంగీతానికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు తమన్ ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారు.

స్పీకర్లు పగిలిపోవడంకాదు.. థియేటర్లు తగలబడిపోతాయ్..! తమన్ ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు మావ
Thaman
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2025 | 1:43 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న తమన్.. ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు. అలాగే పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అలాగే తన ఫాలోవర్ల పోస్టులకు రిప్లై ఇస్తుంటారు. అయితే తాజాగా తమన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రావణ్ మిశ్రా అతుల్ మిశ్రా అనబడే ఇద్దరు పండితులతో తమన్ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమన్ ప్రస్తుతం అఖండ 2 సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అఖండ సినిమాకు తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. సినిమా హిట్ అవ్వడానికి తమన్ సంగీతం అంతో ప్లస్ అయ్యింది. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాకు అంతకు మించి సంగీతం అందించనున్నారు తమన్.. ఇప్పటికే అఖండ 2 సినిమా పనులు మొదలు పెట్టాడు తమన్.. ఇక ఇప్పుడు ఇద్దరు పండితులతో తమన్ ఫోటో వైరల్ కావడంతో.. అఖండ 2కోసమే ఆ పండితులను తమన్ రంగంలోకి దింపారని అంటున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ఆ ఇద్దరు పండితులు గుక్కతిప్పుకోకుండా.. మంత్రోచ్చారణ  చేయగలరు.. అలాగే శ్లోకాలు ఆలపించగలరు.వీరికి సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అఖండ కోసం తమన్ ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్స్.. థియేటర్స్ తగలబడిపోతాయి.. స్పీకర్లు పగిలిపోతాయి అని అంటున్నారు నెటిజన్స్.. మరి తమన్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఇటీవలే [అవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తమన్ అదిరిపోయే సంగీతం అందించారు. ఓజీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!
సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!
మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?
మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?
IND vs NZ 2nd ODI: రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?
IND vs NZ 2nd ODI: రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?
సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం
సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..