AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi Movie: ఈ సెప్టెంబర్ నాటికే.. ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగే

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'వారణాసి'. అడ్వెంచెరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.

Varanasi Movie: ఈ సెప్టెంబర్ నాటికే.. ‘వారణాసి’పై రాజ‌మౌళి బిగ్ అప్‌డేట్.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగే
Varanasi Movie
Basha Shek
|

Updated on: Jun 26, 2026 | 3:48 PM

Share

గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమా ‘వారణాసి’. ఆర్‌ఆర్‌ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి చేపట్టిన ప్రాజెక్టు ఇదే. దీంతో ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాకు మరింత హైప్ ఇచ్చాయి. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న వారణాసి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత ప్రకాశ్ రాజ్ మళ్లీ రాజమౌళి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి డైరెక్టర్ రాజమౌళి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. ‘వారణాసిలో ముఖ్యమైన షూటింగ్ పార్ట్ ను పూర్తిచేశాం. సినిమాలోని భారీ విజువల్ స్పెక్టకిల్ యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ చిత్రీకరించాం. ప్రస్తుతం కథను అనుసంధానించే చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

కాగా వారణాసి సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందించడంపై జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘ మన కళ్లు సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో షూట్‌ చేయడానికి అలవాటు పడ్డాయి. నాకు కూడా అది ఇష్టమే. అయితే వారణాసి కథ ఐమాక్స్‌లో అయితే అద్భుతంగా ఉంటుందని మొదటి నుంచి అనుకుంటున్నాం. అలాగనీ ఈ ఫార్మాట్ కోసం మాత్రం ‘వారణాసి’ కథలో మార్పులు చేయలేదు. చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమే చేశాం. అటు ఐమ్యాక్స్‌, ఇటు సినిమా స్కోప్‌నకు సరిపోయేలా సన్నివేశాలను ఫ్రేమ్‌ చేస్తున్నాం’ అని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం జక్కన్న కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జక్కన్న కెరీర్ లో త్వరగా పూర్తికానున్న సినిమా ఇదేనేమో అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా వారణాసి సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

వారణాసి షూటింగ్ అప్డేట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా