Sirish Bhardwaj: శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం.. ఏమైందంటే?

2007లో శ్రీజ- శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్థలు రావడంతో 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు

Sirish Bhardwaj: శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం.. ఏమైందంటే?
Sirish Bharadwaj

Updated on: Jun 19, 2024 | 11:50 AM

మెగాడాటర్ శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన బుధవారం (జూన్ 19) తుదిశ్వాస విడిచారు. 2007లో శ్రీజ- శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్థలు రావడంతో 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సమయంలో అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరోవైపు శిరీష్ భరద్వాజ్ 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను ‌వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలోనే స్థిరపడ్డారు.

ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్. అయితే గత కొంత కాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు.పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితమే శిరీష్ కన్నుమూశారు. అయితే శిరీష్ భరద్వాజ్ గుండె పోటుతో మృతి చెందినట్టుగా అతని స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు శిరీష్ మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.