Sreeleela: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో శ్రీలీల.. పవన్ కల్యాణ్ పాటకు సూపర్బ్ డ్యాన్స్.. వీడియో ఇదిగో

శ్రీలీల అంటే హుషారెత్తించే డ్యాన్స్ లకు పెట్టింది పేరు. 'పుష్ప 2' సినిమాలో డ్యాన్సింగ్ ఐకాన్ అల్లు అర్జున్ తో పోటీ పడి మరీ స్టెప్పులేసిందీ అందాల తార. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరైన శ్రీలీల మరోసారి తన డ్యాన్స్ తో అదరగొట్టింది.

Sreeleela: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో శ్రీలీల.. పవన్ కల్యాణ్ పాటకు సూపర్బ్ డ్యాన్స్.. వీడియో ఇదిగో
Sreeleela

Updated on: Feb 06, 2026 | 8:17 PM

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది శ్రీలీల. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషా చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అలా ఈ సంక్రాంతికి పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ అందాల తార. సుధా కొంగర తెరకెక్కించిన ఈ మూవీలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీనికి తోడు ఈ మూవీ కేవలం తమిళంలో మాత్రమే విడుదలయ్యింది. దీంతో ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో శ్రీలీల యాక్టింగ్ ను తెలుగు ఆడియెన్స్ మిస్ అయ్యారు. అయితే వచ్చే నెలలలోనే మరో క్రేజీ ప్రాజెక్టుతో మన ముందుకు రానుందీ ముద్దుగుమ్మ. హారీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఇతర కార్యక్రమాలతోనూ శ్రీలీల బిజీగా ఉంటోంది.

తాజాగా హైదరాబాద్‌లోని ఓ మాల్‌ ఓపెనింగ్‌కు హాజరైంది శ్రీలీల. ఈ సందర్భంగా తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ ను మరోసారి బయట పెట్టిందీ అందాల తార. అక్కడికి వచ్చిన అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్‌లోని దేక్‌లేంగే సాలా అంటూ సాగే పాటకు హుషారైన స్టెప్పులు వేసింది. శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ ను చూసి అక్కడున్న వారందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

శ్రీలీల డ్యాన్స్ వీడియో ఇదిగో..

షాపింగ్ మాల్ ను ప్రారంభిస్తోన్న శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.