“ఎస్సీబీ నీ పాట కోసం ఎదురుచూస్తున్నాం”..ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరి అత్య‌వ‌స‌ర‌ చికిత్స పొందుతోన్న‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఎంతో మంది అభిమానులు కోర‌కుంటున్నారు.

ఎస్సీబీ నీ పాట కోసం ఎదురుచూస్తున్నాం..ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 25, 2020 | 5:35 PM

అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరి అత్య‌వ‌స‌ర‌ చికిత్స పొందుతోన్న‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఎంతో మంది అభిమానులు కోర‌కుంటున్నారు. కరోనా నుంచి బయటపడి ఎప్ప‌ట్లానే ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఆయ‌న్ను అభిమానించేవారు సామూహిక ప్రార్థ‌న‌లు చేశారు. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు, సంగీత సమర్పణ చేశారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే ‘ఉషా పూజ’ను బాలు పేరిట చేసినట్లు ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

ఇదే విధంగా కర్ణాటక మంగళూరుకు చెందిన రంగోలి కళాకారుడు జయంత్ సలియాన్ సైతం బాలు కోసం ప్రత్యేకంగా ప్రేయ‌ర్ చేశారు. రంగోలీతో ఎస్పీబీ చిత్రపటాన్ని త‌యారు చేశారు. ఆయ‌న‌ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

కొవిడ్ డెడ్‌బాడీల‌ను తీసుకెళ్లే అంబులెన్సులకు ఛార్జీలు ఫిక్స్