ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలై ఇప్పటికీ మూడు వారాలు దాటినప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. డైరెక్టర్ సుకుమార్ మేకింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా విడుదలై నెలరోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ నెట్టింట ఈ మూవీ జోరు తగ్గడం లేదు. ఇక ఈ మూవీ నుంచి వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా పుష్ప 2 కపుల్స్ సాంగ్ వీడియో వెర్షన్ విడుదల చేశారు.
ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో పుష్ప 2 సాంగ్స్ దూసుకుపోతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ మూవీ పాటలకు డ్యాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట ఇన్నాళ్లు ఆడియో వర్షన్ అన్ని భాషలలో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఆ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు వీడియో వెర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా, జగపతి బాబు, రావు రమేశ్, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.