సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ స్టైలీష్ విలన్. అరుంధతి, జులాయి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వెండితెరపై విలన్ అయినా.. నిజ జీవితంలో మాత్రం హీరో. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ చేయూత అందిస్తాడు. కొవిడ్ సమయంలో ఎంతోమందికి సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. పవర్ ఫుల్ విలన్ పాత్రలతో భయపెట్టినా రియల్ లైఫ్ లో దేవుడు అంటూ ఎంతో మంది ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ ఏ అవసరం ఉన్న లేదనకుండా సాయం చేస్తుంటారు. ఫౌండేషన్స్ కూడా రన్ చేస్తున్నాడు. పేద విద్యార్థులకు అండగా ఉంటున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు సోనూసూద్.
మూడేళ్ల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి పెద్ద మనసు చాటుకున్నాడు సోనూసూద్. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందు ప్రియలది నిరుపేద కుటుంబం. వీరి మూడేళ్ల కూతురు చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించాలంటే రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్స్ తెలిపారు. వైద్యం చేయించడానికి ఆర్థికంగా బలంగా లేని కృష్ణ, బిందుప్రియలు సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు. వీరి విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లింది. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఆ చిన్నారికి ముంబైలో ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కష్టాల్లో ఉన్న చిన్నారి ప్రాణాలు కాపాడి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన దేవుడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ సోనూసూద్ కర్నూలు జిల్లాకు చెందిన కమారి అనే యువతికి చదువుకోవడానికి సహాయం చేశారు.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.