Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి మళ్లీ ఫోటోస్ లీక్.. బీచ్‏లో చరణ్, కియారా అద్వానీ డాన్స్..

ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. కీలకపాత్రలో హీరోయిన్ అంజలి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు లీక్స్ బెడద ఉంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఫోటోస్ లీక్ అయిన సంగతి తెలిసిందే.

Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి మళ్లీ ఫోటోస్ లీక్.. బీచ్‏లో చరణ్, కియారా అద్వానీ డాన్స్..
Game Changer

Updated on: Aug 23, 2023 | 1:54 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు తాత్కాలికంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. దాదాపు మూడు నెలలపాటు షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్న చరణ్ ఇటీవలే తిరిగి సెట్ లో అడుగుపెట్టారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. కీలకపాత్రలో హీరోయిన్ అంజలి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు లీక్స్ బెడద ఉంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఫోటోస్ లీక్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరోసారి సినిమా సెట్‌లో ఉన్న ఫోటోస్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదల కావడం మినహా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ లేదు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించిన స‌మాచారం ప్ర‌త్యేక రోజున ఇవ్వాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ, అంతకుముందే ఈ సినిమా షూటింగ్ లొకేషన్ ఫోటో లీకైంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ నుంచి లీకైన ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో చరణ్, కియారా బ్లాక్ డ్రెస్ ధరించి కనిపిస్తున్నారు.

తాజాగా లీక్ అయిన ఫోటోలో రామ్ చరణ్ బీచ్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కూడా కనిపించింది. ఇక ఫోటోస్ లీక్ కావడంపై ఇప్పటివరకు చిత్రయూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ముందుగా ఈ సినిమా సెట్స్‌పైకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని చిత్రబృందం ప్రకటన చేసింది. అయినప్పటికీ లీక్స్ మాత్రం ఆగడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.