గుండెపోటుకు మరో సెలబ్రిటీ బలయ్యారు. బీజేపీ నేత, ప్రముఖ టిక్‌టాక్ స్టార్ సోనాలి పోగట్(Sonaliiphogat)ఆకస్మిక మృతి అందరిని షాక్‌కు గురిచేసింది. ఫ్రెండ్స్‌తో కలిసి గోవా టూర్‌కు వెళ్లిన 42 ఏళ్ల సోనాలి పోగట్ గుండెపోతు చనిపోయారు..బీజేపీ తరపున 2019లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు సోనాలి పోగట్. కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరిన కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓడిపోయారు. అయితే బీజేపీలో చేరిన తరువాత కుల్దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆదంపూర్ ఉప ఎన్నికల్లో సోనాలి పోగట్ బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. బిగ్ బాస్ 14లో ఆమె చివరిసారి కనిపించారు. అయితే సొనాలి ఫోగట్ మరణంపై ఆమె సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫుడ్ పాయిజన్ వల్లే సొనాలి ఫోగట్ తీవ్ర అనారోగ్యానాకి గురయ్యారని ఆమె సోదరి ఆరోపించారు. సొనాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆహారం తీసుకున్న తర్వాత అసౌకర్యంగా ఉందని చెప్పారని, తన ఆహారంలో కొందరు ఏదో మిక్స్ చేశారని అనుమానం వ్యక్తం చేశారని కూడా సొనాలి పోగట్ సోదరి విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. అయితే సొనాలి ఫోగట్ మరణంలో అనుమాస్పదంగా ఏవీ బయటపడలేదని పోలీసులు తోసిపుచ్చారు. అటు 2016లో సోనాలి పోగట్ భర్త సంజయ్ పోగట్ సంజయ్ ఫోగట్ 2016లో అనుమానాదస్ప రీతిలో తన ఫామ్‌హౌజ్‌లో చనిపోయారు.ఇప్పుడు సోనాలి పోగట్ గుండెపోటు మృతి చెందడం..ఆమె సోదరి డెత్‌పై డౌట్స్ రైజ్ చేయడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంసమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి