SKYLAB Pre Release Event: నేచురల్ స్టార్ నాని గెస్ట్‌గా “స్కై లాబ్” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

SKYLAB Pre Release Event: నేచురల్ స్టార్ నాని గెస్ట్‌గా స్కై లాబ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్..
Skylab
Follow us

|

Updated on: Nov 28, 2021 | 7:13 PM

SKYLAB Pre Release Event: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. బండ లింగ‌ప‌ల్లిలో గౌరి(నిత్యా మీన‌న్‌) ఓ ధ‌నివంతురాలి బిడ్డ‌. కానీ జ‌ర్న‌లిస్ట్ కావాల‌నే కోరిక‌తో ప్ర‌తిబింబం పత్రిక‌కు వార్త‌లు సేక‌రించి రాస్తుంటుంది. డాక్ట‌ర్‌ ఆనంద్‌(స‌త్య‌దేవ్‌) త‌న గ్రామంలో హాస్పిట‌ల్ పెట్టాల‌నుకుంటాడు. అయితే త‌న‌కు కాస్త స్వార్థం. త‌న ప‌ని పూర్త‌యితే చాలు అనుకునే ర‌కం ఆనంద్‌, ఎప్పుడూ డ‌బ్బు గురించే ఆలోచిస్తుంటాడు. వీరితో పాటు సుబేదార్ రామారావు జ‌త క‌లుస్తాడు. వీరి జీవితాల్లో ఏదో ర‌కంగా సాగుతుంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో స‌మ‌స్య. మ‌రి వారి స‌మ‌స్య‌లు తీరాలంటే ఏదైనా అద్భుతం జర‌గాల‌ని అనుకుంటారు. అదే స‌మ‌యంలో అంత‌రిక్ష్యంలో ప్ర‌వేశ పెట్టిన ఉప‌గ్ర‌హం స్కైలాబ్‌లో సాంకేతిక కార‌ణాలో పెను ప్ర‌మాదం వాటిల్ల‌బోతుంద‌ని రేడియోలో వార్త వ‌స్తుంది. అది నేరుగా బండ లింగ‌ప‌ల్లిలోనే ప‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తారు. అప్పుడు అంద‌రి జీవితాల్లో ఎలాంటి మార్పులు వ‌స్తాయి. అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ‘స్కై లాబ్‌’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

డిసెంబ‌ర్ 4న సినిమా విడుద‌ల‌వుతుంది. స్కైలాబ్‌ డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ లో నిర్వహించారు. ఈ క్రయక్రమానికి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya: సిద్ద వచ్చేశాడు.. “ఆచార్య” పై అంచనాలను పెంచేసిన రామ్ చరణ్ టీజర్

Swara Bhaskar: అలా చేసినందుకు ఎండార్స్‌మెంట్‌ కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి.. బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌

D. Suresh Babu : అందుకే “దృశ్యం 2” సినిమాను థియేట్సర్స్‌కు ఇవ్వలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన సురేష్ బాబు..

Latest Articles