
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్. తమిళ నట స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఈ వర్సటైల్ యాక్టర్. శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. శివకార్తికేయన్ నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రిన్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శివకార్తికేయన్ మాట్లాడుతూ..’ప్రిన్స్ చిత్రాన్ని గొప్పగా నిర్మించి దీపావళికి గ్రాండ్ గా విడుదల చేసి ప్రేక్షకులకు వినోదం పంచబోతున్న మా నిర్మాతలు సునీల్ నారంగ్, సురేష్ బాబు, రామ్ మోహన్ రావు గారికి కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు అనుదీప్ స్టయిల్ లో ప్రిన్స్ అందరికీ వినోదం పంచబోతుంది. ఒక ఇండియన్ , బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడటం ఈ సినిమా లైన్. దిన్ని అనుదీప్ హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. అక్టోబర్ 21న థియేటర్లో నవ్వుల వర్షం కురుస్తుంది. వరుణ్ డాక్టర్, డాన్ చిత్రాలని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రిన్స్ కూడా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. తమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.
అలాగే మనోజ్ పరమహంస బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. మారియాతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. తన దేశంలో(ఉక్రెయిన్) యుద్ధం జరుగుతుంది. ఈ సినిమాకి పని చేసిన డబ్బులతో తన దేశంలోని బాదితులకు సాయం చేయాలకునే గొప్ప మనసు తనది. అనుదీప్ ఈ సినిమాలో వినోదంతో పాటు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. అక్టోబర్ 21న ప్రిన్స్ ని థియేటర్ చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు శివకార్తికేయన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.