Mrunal Thakur: చెప్పడం కాదు.. డిమాండ్ చేయాలి.. ఆ విషయంలో హీరోయిన్లకు సలహా ఇస్తోన్న సీతారామం బ్యూటీ..

సీరియల్స్ ద్వారా బుల్లితెరపై కెరీర్ ఆరంభించిన మృణాల్.. ఆ తర్వాత కథానాయికగా మారింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

Mrunal Thakur: చెప్పడం కాదు.. డిమాండ్ చేయాలి.. ఆ విషయంలో హీరోయిన్లకు సలహా ఇస్తోన్న సీతారామం బ్యూటీ..
Mrunal Thakur

Updated on: Dec 18, 2022 | 1:31 PM

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయం ఉండడటమే కాదు.. కాసింత అదృష్టం కూడా ఉంటే సక్సెస్ కావొచ్చు అనే ఫార్మూలను ఇప్పటికే పలువురు భామలు రుజువు చేశారు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోయింది. ఇక ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఇక ఇదే జాబితాలోకి వచ్చిన మరో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ ద్వారా బుల్లితెరపై కెరీర్ ఆరంభించిన మృణాల్.. ఆ తర్వాత కథానాయికగా మారింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన ఈ అందమైన ప్రేమకథలో మృణాల్ కథానాయిక. ఇందులో ఆమె సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. మృణాల్ లుక్స్.. నటనకు సౌత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రెమ్యూనరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కథానాయికలు పారితోషికం చెప్పడానికి సందేహించకూడదని.. డిమాండ్ చేయాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల్లో మనకున్న ఇమేజ్ ను బట్టి మనకు ఎంత పారితోషికం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్స్ తాము కోరుకున్న పారితోషికాల్సి డిమాండ్ చేసే విషయంలో తెలియని అయమోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరే,న్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో అర్థమవుతుంది ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.