Mrunal Thakur: టాలీవుడ్‏లో సీతారామం బ్యూటీ హల్చల్.. న్యాచురల్ స్టార్‏ను కలిసి మృణాల్.. అదే కారణమా ?..

అద్భుతమైన నటనతో.. అచ్చం తెలుగింటి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో దక్షిణాదిలో మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Mrunal Thakur: టాలీవుడ్‏లో సీతారామం బ్యూటీ హల్చల్.. న్యాచురల్ స్టార్‏ను కలిసి మృణాల్.. అదే కారణమా ?..
Mrunal Thakur, Nani

Updated on: Oct 11, 2022 | 2:08 PM

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో సీతామాహలక్ష్మీగా నిలిచిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమా సీతారామంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. సినీ ప్రియులు.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిచన సీతారామం మూవీలో మలాయళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించగా.. సీతామహాలక్ష్మిగా మృణాల్ కనిపించింది. అద్భుతమైన నటనతో.. అచ్చం తెలుగింటి అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో దక్షిణాదిలో మృణాల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూకట్టిన టాక్ వినిపిచింది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఇక మృణాల్ తదుపరి చిత్రాల గురించి మాత్రం ఎప్పటికప్పుడు నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ న్యాచురల్ స్టార్‏ను కలిసింది . వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా మృణాల్.. న్యాచురల్ స్టార్ నానిని కలిసింది. వీరిద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించారు నాని. ఇప్పటికే సీతారామం జోడితో మరో మూవీ రాబోతుందంటూ నిర్మాత అశ్వనీదత్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మృణాల్.. తారక్.. కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీలోనూ ఎంపికైనట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.