Singer Sunitha : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అందాల సింగర్.. మొక్కలు నాటిన సునీత

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన రూపంతో పాటు మధురమైన గాత్రం సునీత సొంతం. వందల పాటలతో అలరించిన సునీత ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు

Singer Sunitha : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అందాల సింగర్.. మొక్కలు నాటిన సునీత
Sinitha

Updated on: Jun 29, 2022 | 12:24 PM

సింగర్ సునీత(Singer Sunitha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందమైన రూపంతో పాటు మధురమైన గాత్రం సునీత సొంతం. వందల పాటలతో అలరించిన సునీత ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా సునీత రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇందులో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు సునీత. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

అలాగే ప్రకృతి కన్నతల్లిలాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. పర్యావరణం పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ విసిరిన సునీత.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి