సోషల్ మీడియాలో సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్స్ ఓపెన్ చేసి మోసాలకు పాల్పడడం సర్వ సాధారణం. ఫేమస్ నటీనటుల పేరుతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేయడం.. ఫోన్ కాల్స్, మేసేజ్‌లు, అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం చేస్తుంటారు కొందరు కేటుగాళ్లు. ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ మోసాల బారిన పడ్డారు. ఈ విషయాన్ని నటీనటులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తమ ఖాతాలు హ్యాక్ చేసారని.. నెటిజన్స్ తమ పేరుతో ఉండే నకిలీ ఖాతాల కేటుగాళ్ల వలలో పడకండి అంటూ ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా ఫీమేల్ సింగర్ రమ్య బెహరా (Ramya Behara ) కూడా ఇలాటి చిక్కుల్లో పడింది.
ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలో పాట పాడి ఫేమస్ అయ్యింది రమ్య. అలాగే తెలుగు సినిమాల్లో అనేక పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే పలు సింగింగ్ షోలలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అటు సినిమాల్లో పాటలు పాడడమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది రమ్య. ఈ క్రమంలో తన పేరుతో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకుంది.
తన పేరుతో ఎవరో ఫేక్ కాల్స్ చేస్తున్నారని తెలుసుకుంది. వెంటనే సదరు నంబర్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది తన నంబర్ కాదని.. దానికి ఎవరు రియాక్ట్ కావద్దని.. వెంటనే బ్లాక్ చేయాలని కోరింది. మొత్తానికి రమ్య తన పేరుతో జరుగుతున్న మోసాలను వెంటనే కనిపెట్టి.. తన ఫాలోవర్లను అలర్ట్ చేసింది.
Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..