Raviteja: అలాంటి సినిమా చేయాలని ఉంది.. మాస్ మాహారాజా రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తమిళ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్ (FIR). ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శక‌త్వం వ‌హించారు.

Raviteja: అలాంటి సినిమా చేయాలని ఉంది.. మాస్ మాహారాజా రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Raviteja
Follow us

|

Updated on: Feb 08, 2022 | 8:58 AM

తమిళ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్ (FIR). ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్పణ‌లో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్ సరసన మంజిమా మోహన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్దు జొన్నలగడ్డ, సందీప్ కిషన్, రవితేజ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్బంగా మాస్ మాహారాజా రవితేజ మాట్లాడుతూ.. “ఆరు నెలల క్రితం ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది. విష్ణు విశాల్‌కు ఆల్ ది బెస్ట్” అని అన్నారు. అలాగే.. హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను. డైరెక్ట్ తెలుగు సినిమాను కూడా త్వరలోనే చేస్తాను. రవితేజ గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. రవితేజ వద్ద పని చేసే శ్వేతను పరిచయం చేసి ఇదంతా జరిగేందుకు కారణమైన జ్వాలకు థ్యాంక్స్. అభిషేక్ పిక్చర్స్ వారు ఈ సినిమాను చూశారు. థియేటర్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. ఓటీటీ అనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇప్పుడు కేవలం తమిళంలోనే కాదు తెలుగులోనూ సినిమాను విడుదల చేస్తున్నాం. సందీప్ కిషన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఫిబ్రవరి 11న రావాలని సడెన్‌గా నిర్ణయించుకున్నాం. చివరి క్షణాల్లోనే అంతా ఫిక్స్ అయ్యాం. రవితేజ గారు మా సినిమా చూసి మెచ్చుకున్నారు. ప్రెజెంట్ చేసేందుకు రెడీ అన్నారు. ఆయన నాకు బ్రదర్‌లా అనిపించారు. ఖిలాడీ సినిమాతో హీరోగా, ఈ సినిమాతో ప్రజెంటర్‌గా వస్తున్నాను అయితే ఏంటి? అని కూల్‌గా రిప్లై ఇచ్చారు. ఆయనకు థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ అంటే చాలా ఇష్టం. ఫిబ్రవరి 11న థియేటర్లోకి రాబోతోన్నాం. అందరూ చూడండి’ అని అన్నారు.

Also Read: Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Nivetha pethuraj: డిజిటల్ ఎంట్రీకి సిద్దమైన టాలెంటెడ్ బ్యూటీ.. ఆహాలో నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’..ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్..

F3 Movie: పైసా ఉంటే ప్రపంచమే పిల్లి.. లబ్ డబ్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. థియేటర్లలో ఎఫ్ 3 సందడి ఎప్పుడంటే..

Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..