Rajamouli: అందుకే రాజమౌళి అన్నయ్య నాకు ఛాన్స్ ఇవ్వలేదు.. ఆసక్తికర కామెంట్లు చేసిన ఎంఎం శ్రీలేఖ..

జక్కన్న సినిమాలకు ఎంఎం కీరవాణి సినిమాలకు ఆమె సింగర్‏గా వర్క్ చేసింది తక్కువే. అయితే ఈమె ఎక్కువగా జక్కన్న సినిమాలో పాటలు పాడకపోవడంతో అనేక రకాల రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి.

Rajamouli: అందుకే రాజమౌళి అన్నయ్య నాకు ఛాన్స్ ఇవ్వలేదు.. ఆసక్తికర కామెంట్లు చేసిన ఎంఎం శ్రీలేఖ..
Mm Sreelekha
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 02, 2022 | 5:22 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకులలో ఎంఎం శ్రీలేఖ ఒకరు. 1994 లో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన నాన్నగారు సినిమాత మ్యూజిక్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించారు శ్రీలేఖ. దాదాపు 80 సినిమాలకు పైగా సంగీతం అందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఆమె ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన సినిమాలకు మ్యూజిక్ అందించారు. వీరి కాంబినేషన్లో 13 సినిమాలకు సంగీతం అందించారు. ఎంఎం శ్రీలేఖ డైరెక్టర్ రాజమౌళి కుటుంబసభ్యురాలే. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సొంత చెల్లి. రాజమౌళి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా బయట సినిమాల్లోనే వర్క్ చేశారు. జక్కన్న, ఎంఎం కీరవాణి సినిమాలకు ఆమె సింగర్‏గా వర్క్ చేసింది తక్కువే. అయితే ఈమె ఎక్కువగా జక్కన్న సినిమాలో పాటలు పాడకపోవడంతో అనేక రకాల రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి.

అయితే ఈ వార్తలపై ఎప్పుడూ రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శ్రీలేఖ. అన్నయ్య రాజమౌళి సినిమాలు ఎందుకు అవకాశాలు ఇవ్వరు అనే విషయంపై పూర్తి వివరణ ఇచ్చారు. శ్రీలేఖ మాట్లాడుతూ.. “మా కుటుంబం మొత్తం కూడా వర్క్ పరంగా అయితే ఎవరి పని వాళ్లదే.. కుటుంబపరంగా మాత్రం మేము అందరం కలిసే ఉంటాం. కానీ ఎప్పుడూ ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అనేది దర్శకుడిగా మ్యూజిక్ డైరెక్టర్ గా మా అన్నయ్యల సొంత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నేను వారికి ఉపయోగపడతాను అంటే అందులో ఏమాత్రం సందేహించకుండా అవకాశం ఇస్తాను.

ఇవి కూడా చదవండి

అలాగే సొంతంగా నేను ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాను. ఇక రాజమౌళి కీరవాణి గారి కాంబినేషన్ సె ట్ అయ్యింది. కాబట్టి వాళ్లు ఆ కాంబినేషన్ వదులుకోరు. అంతేకాకుండా రాజమౌళి అన్నయ్యకు ఎప్పుడూ ఎవరిని ఎలాంటి ప నికి ఉపయోగించుకోవాలని బాగా తెలుసు. నాకు కూడా భవిష్యత్తులో అన్నయ్య సినిమాలో పాడే అవకాశం వస్తుందేమో. మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. నేను అనేక సినిమాలకు వర్క్ చేస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు శ్రీలేఖ.