Song : సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఎక్కడ చూసిన అదే సాంగ్.. ఇంతకీ మీరు ట్రై చేశారా.. ?
సాధారణంగా సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్న విషయం క్షణాల్లో తెగ వైరలవుతుంటాయి. ఇక సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. విడుదలైన కాసేపటికే నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు నెట్టింట పూర్తిగా ఫోక్ సాంగ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసిన తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇప్పుడు మరో సాంగ్ నెట్టింట వైరవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో తెలంగాణ ఫోక్స్ సాంగ్స్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు నెట్టింట అనేక పాటలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చిన్న పెద్దా తేడా లేకుండా మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు రెండు రోజులుగా ఓ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కేవలం 37 సెకన్లపాటు రిలీజ్ అయిన గ్లింప్స్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఈ పాటకు స్టెప్పులు ఇరగదీస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ యూట్యూబ్ లో 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తూనే ఉంది. ఇక ఇన్ స్టాలో అయితే చెప్పక్కర్లేదు. ఈ సాంగ్ గ్లింప్స్ కు రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ సాంగ్.. “బాయిలోనే బల్లిపలికే..” ఈపాటికే ఈ సాంగ్ మీ చెవుల్లో మారుమోగుతుంటుంది. సింగర్ మంగ్లీ.. మరో సింగర్ నాగవ్వతో కలిసి పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. గత రెండు రోజుల క్రితం ఈ సాంగ్ గ్లింప్స్ రిలీజ్ కాగా.. మరికొద్ది రోజుల్లోనే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. కానీ ఇప్పటికే ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాటకు రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
ఇప్పుడు బాయిలోనే బల్లిపలికే పాట దూసుకుపోతుంది. నిజానికి సింగర్ మంగ్లీ పాడిన పాటలకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆమె పాడితే ఆ హుషారు ఎలా ఉంటుందో తెలుసుగా.. ఇక ఫాక్ సాంగ్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ఫోక్స్ సాంగ్స్ తో అదరగొట్టిన మంగ్లీ.. ఇప్పుడు బాయిలోనే బల్లిపలికే పాటతో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో మంగ్లీ గొంతుతోపాటు సింగర్ నాగవ్వ గొంతు సైతం శ్రోతలకు హుషారు తెప్పి్స్తుంది. అలాగే ఇందులో మంగ్లీ అదిరిపోయే స్టెప్పులు వేయడంతో మరింత ఆకట్టుకునే విధంగా మారింది. ఇదెలా ఉంటే.. ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాకా.. డీజేలో మారుమోగడం ఖాయమనే చెప్పాలి. ఈ పాటను కమల్ ఇస్లావత్ రాయగా.. సురేశ్ బొబ్బిలి అదిరిపోయే మాస్ మ్యూజిక్ అందించారు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీలో అందించిన స్టెప్పులు ఇప్పుడు ఇన్ స్టాను షేక్ చేస్తున్నారు. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు.
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..




