Lata Mangeshkar: ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డాక్టర్స్..

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆమెను

Lata Mangeshkar: ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డాక్టర్స్..
Lata Mangeshkar

Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 16, 2022 | 1:58 PM

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన పరీక్షలలో కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వినిపించాయి. దీంతో లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని.. కేవలం ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని గతంలో వైద్యులు తెలిపారు. ఇక వారం గడుస్తున్న లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉండడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు మరోసారి లతా మంగేష్కర్ ఆరోగ్యంపై స్పందించారు. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సామ్ద్ మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంది.. అది ఎన్ని రోజులు అనేది చెప్పడం కష్టం. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం అంటూ చెప్పుకోచ్చారు. మరోవైపు లతా మంగేష్కర్ ఆరోగ్యంపై సింగర్ ఆశా భోంస్లే స్పందించారు. కరోనా పాజిటివ్ రావడంతో సోదరిని చూసేందుకు అనుమతించడం లేదని తెలిపారు. ఒకేసారి నేను ఆసుపత్రికి వెళ్లినా కానీ కాంపౌండ్ లోకి అనుమతించలేదు. కానీ దీదీ పరిస్థితి మెరుగుపడుతోంది అంటూ భోంస్లే తెలిపారు. లతా మంగేష్కర్ 1942 లో కెరీర్ ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 30 నుంచి 50 వేల పాటలు పాడారు.

Also Read: Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..