AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer K. S. Chithra: చిత్రమ్మ చిరునవ్వు వెనుక ఆవిరైన కన్నీళ్లు.. మనసులోని బాధను బయటపెట్టిన సింగర్..

అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. సంగీత ప్రపంచంలో ఆమె స్వర శిఖరం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలమే. ప్రేమ, కరుణ, భయానకం ఇలా ఏ సన్నివేశానికైనా ఆమె గళం తోడైతే ఆ పాట మరింత అద్భుతంగా మారుతుంది. ప్రేమ పాటలు, భక్తి పాటలు, అమ్మ ప్రేమను తెలిపే సంగీతం ఇలా ఏదైన సరే చిత్ర గళంతో ప్రజలను ఓలలాడించారు. సౌత్ టూ నార్త్ అన్ని ఇండస్ట్రీలలో దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడారు. ఎంతో మంది సంగీత ప్రియుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. తనే సింగర్ చిత్ర. యావత్ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో

Singer K. S. Chithra: చిత్రమ్మ చిరునవ్వు వెనుక ఆవిరైన కన్నీళ్లు.. మనసులోని బాధను బయటపెట్టిన సింగర్..
Ks Chithra
Rajitha Chanti
|

Updated on: Nov 26, 2023 | 10:54 AM

Share

మనసుకు ప్రశాంతత కావాలంటే సంగీతం వినాల్సిందే. అందులోనూ ఆమె స్వరం ఒత్తిడిని దూరం చేసి బాధను తగ్గించి ప్రేమను పంచుతుంది. అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. సంగీత ప్రపంచంలో ఆమె స్వర శిఖరం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలమే. ప్రేమ, కరుణ, భయానకం ఇలా ఏ సన్నివేశానికైనా ఆమె గళం తోడైతే ఆ పాట మరింత అద్భుతంగా మారుతుంది. ప్రేమ పాటలు, భక్తి పాటలు, అమ్మ ప్రేమను తెలిపే సంగీతం ఇలా ఏదైన సరే చిత్ర గళంతో ప్రజలను ఓలలాడించారు. సౌత్ టూ నార్త్ అన్ని ఇండస్ట్రీలలో దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడారు. ఎంతో మంది సంగీత ప్రియుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. తనే సింగర్ చిత్ర. యావత్ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మధురమైన ఆమె గాత్రం సంగీత ప్రియులను కన్నీళ్లు పెట్టిస్తుంది.. నవ్విస్తుంది.. అలరిస్తుంది. సంప్రదాయ చీరకట్టు, బొట్టుతో ఎంతో హుందగా.. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తారు సింగర్ చిత్ర. కానీ ఆ స్వచ్చమైన చిరునవ్వు వెనక చెప్పలేనంత విషాదం దాగుంది.

చిత్ర జీవితంలో ఎప్పటికీ చెరగని దుఃఖం.. తన కూతురు నందన దూరమవడం. చిత్ర.. విజయ్ శంకర్ అనే ఇంజనీర్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన చాలా సంవత్సరాలకు 18 డిసెంబర్ 2002లో నందన అనే అమ్మాయి జన్మించింది. కానీ ఆ చిన్నారి డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడేది. తొమ్మిదేళ్ల వయసులో 2011లో ఓ కచేరి కోసం చిత్ర వెళ్లగా అదే సమయంలో నందన స్విమ్మింగ్ పూల్లో పడి కన్నుమూసింది. అయితే కూతురిని తలుచుకుంటూ చిత్ర తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఆ బాధ లోలోపలే ఉండిపోయింది. కానీ ఆమెకు సంగీతం ఊరటనిచ్చింది. ఆ దుర్ఘటన జరిగాక మాములు మనిషి కావడానికి చాలా సమయం పట్టిందని.. సంగీతాన్ని విడిచిపెట్టాలనుకున్నట్లు తెలిపింది. కానీ కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఇప్పటికీ ఈ స్థాయిలో నిలబడ్డానని గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం చిత్ర ఓవైపు సినిమాలకు పాటలు పాడుతూనే మరోవైపు రియాల్టీ సింగింగ్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళంలో సింగింగ్ రియాల్టీ షో సీజన్ 9లో చిత్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్లు ఆవిరైనట్లు తెలిపారు. ఈ షోలో చిత్ర కార్ముకిల్వర్ణన్ సాంగ్ పాడడంతో అక్కడున్నవారంతా బావోద్వేగానికి గురయ్యారు. ఆ పాటలో మనసును కట్టిపడేసే విషయం దాగి ఉంది. హరికాంభోజి రాగంలోని ఆ పాట చిత్ర సంగీత జీవితంలో మైలురాళ్లలో ఒకటి. అయితే ఈ సాంగ్ పాడడంతో అక్కడున్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ చిత్ర చిరునవ్వుతో కనిపిస్తుంది. దీంతో ఆ అక్కడే ఉన్న యాంకర్ మాట్లాడుతూ అందరం ఎమోషనల్ అయ్యాం కానీ మీరు చిరునవ్వుతోనే కనిపిస్తున్నారు అని అడగ్గా.. ‘గతంలో చాలా ఏడ్చాను’ అంటూ నవ్వుతూనే చెప్పుకొచ్చింది చిత్ర. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఎమోషల్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by K S Chithra (@kschithra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.