AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కేసులో కోర్టు తీర్పు నాలో ధైర్యాన్ని నింపిందన్న సింగర్ చిన్మయి.. ఇప్పటికైనా అలాంటి వారు కళ్ళు తెరవాలంటూ..

చిన్మయి శ్రీపాద ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు, కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా చిన్మయి మంచి పేరు సంపాదించుకున్నారు.

ఆ కేసులో కోర్టు తీర్పు నాలో ధైర్యాన్ని నింపిందన్న సింగర్ చిన్మయి.. ఇప్పటికైనా అలాంటి వారు కళ్ళు తెరవాలంటూ..
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2021 | 4:17 PM

Share

Chinmayi Sripaada : చిన్మయి శ్రీపాద ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు, కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా చిన్మయి మంచి పేరు సంపాదించుకున్నారు. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తన గళాన్ని వినిపించారు. తనుకూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ గతంలో చిన్మయి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు తనలో ధైర్యాన్ని నింపింది అని చిన్మయి అన్నారు. ఇంతకు ఆ కేసు ఏంటంటే..

మీటూ ఉద్యమంలో భాగంగా ప్రియా రమణి చేసిన ఆరోపణల కారణంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంజే అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గతంలో ఎంజే అక్బర్ ఒక పత్రికకు ఎడిటర్ గా చేస్తున్న సమయంలో ప్రియా రమణి జర్నలిస్ట్ గా చేస్తున్నారు. ఆ సమయంలో తనపై అక్బర్ లైంగిక వేదింపులు చేశారంటూ రమణి ఆరోపణలు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రియా రమణి మీటూ ఆరోపణలు చేసిందంటూ ఆమెపై పరువు నష్టం దావా వేసిన ఎంజే అక్బర్ కు కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రితం సంఘటనల ఆధారంగా ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటీ అంటూ ఎంజే అక్బర్ కోర్టులో వాదించాడు.  అయినాఎప్పుడు చేసినతప్పు తప్పేఅంటూ.. కోర్టుతీర్పు ఇచ్చింది.ఈ విషయంపై చిన్మయి స్పందిస్తూ..ప్రియా రమణి కేసులో కోర్టు తీర్పు తో ఇంకా న్యాయం బతికే ఉందని వెళ్లడి అయ్యిందని చిన్మయి అన్నారు. నిజం ఇప్పుడు కాకున్నా ఎప్పటికి అయినా గెలుస్తుంది. ఇప్పటికి అయినా రాధారవి.. వైరముత్తులకు సపోర్ట్ చేసే వారు కళ్లు తెరవండి. వారికి సపోర్ట్ చేస్తున్న వారు అంతా కూడా మారాల్సిన సమయం వచ్చిందని చిన్మయి అన్నారు. అంతా నన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. ఆ బాధలు అన్ని కూడా మర్చి పోయేలా ఈ తీర్పు నాకు ధైర్యంను నింపిందని చిన్మయి పేర్కొన్నారు.

మరిన్ని ఇక్క చదవండి :

Nootokka Zillala: మే 7న రావడానికి ముస్తాబవుతోన్న ‘నూటొక్క జిల్లాల అందగాడు’.. క్రిష్‌ సమర్పణలో..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్