AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోగా సింహరాశి చైల్డ్ ఆర్టిస్ట్.. ఓటీటీలోకి వస్తున్న రూరల్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన తారలు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మెప్పిస్తున్నారు. తేజా సజ్జా, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్ వంటి తారలు ఒకప్పుడు బాల నటీనటులుగా కనిపించినవారే. రాజశేఖర్ హీరోగా నటించిన సింహరాశి సినిమాలో కనిపించిన చిన్నోడు.. ఇప్పుడు హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.

Tollywood : హీరోగా సింహరాశి చైల్డ్ ఆర్టిస్ట్.. ఓటీటీలోకి వస్తున్న రూరల్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
Mahendran
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2026 | 8:12 PM

Share

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన వారిలో మహేంద్రన్ ఒకరు. తెలుగులో సింహరాశి, దేవి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. చిన్న వయసులోనే బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ నీలకంఠ. ఈ సినిమా జనవరి 2న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

“పవర్ కష్టాలు.. విజయాలను నీలకంఠలో చూడండి. ఫిబ్రవరి 6 నుంచి కేవలం సన్ నెక్ట్స్ లో చూడండి” అంటూ రాసుకొచ్చింది. వాళ్లు శిక్షించిన మనిషి.. వాళ్ల లీడర్ గా ఎదిగాడు అనే కామెంట్ ఉన్న పోస్టర్ షేర్ చేశారు. నీలకంఠ ఓ రూరల్ డ్రామా.. ఓ సాధారణ టేలర్ గా ఉన్న యువకుడు గొప్ప చదువులు చదవాలని కలలు కంటాడు. కానీ చిన్నతనంలో చేసిన తప్పు వల్ల కొన్నాళ్లపాటు ఊరు విడిచి ఎక్కడికి వెళ్లకుండా పై చదువులు చదవకుండా శిక్ష ఎదుర్కొంటాడు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ఆ తర్వాత అతడు కబడ్డీ ఆడాలని నిర్ణయించుకుంటాడు. అతడి జీవితాన్ని ఎలా మార్చింది ? అతడు చేసిన తప్పేంటీ ? అనేది నీలకంఠ సినిమా. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన మహేంద్రన్ హీరోగా ఎలా మెప్పించాడు అనేది నీలకంఠలో చూడొచ్చు.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..