Tillu Square Collections: ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల మోత.. 100 కోట్ల క్లబ్‌లో సిద్దు సినిమా.. 9 రోజుల లెక్కలివిగో

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. ఆరంభం నుంచే రికార్డు కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా టిల్లు సినిమా మరో  ఘనత అందుకుంది. అనకుకున్న దాని కంటే ముందే

Tillu Square Collections: టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. 100 కోట్ల క్లబ్‌లో సిద్దు సినిమా.. 9 రోజుల లెక్కలివిగో
Tillu Square Movie

Updated on: Apr 07, 2024 | 4:45 PM

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. ఆరంభం నుంచే రికార్డు కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా టిల్లు సినిమా మరో  ఘనత అందుకుంది. అనకుకున్న దాని కంటే ముందే రూ. 100 కోట్ల క్లబ్‌ లో చేరింది. కేవలం 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా టిల్లు స్క్వేర్ మూవీకి రూ.101.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ పోస్టర్‌ను టిల్లు స్క్వేర్ మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ‘ఎప్పుడూ పెద్దగా కలలు కనండి. దాన్ని సాకారం చేసుకునేందుకు శ్రమించండి. మా స్టార్ బాయ్ సిద్ధు తాను సెట్ చేసుకున్న గోల్‍ను డబుల్ స్పీడ్‍లో సాకారం చేసుకున్నారు. డబుల్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ సినిమా రూ.100 కోట్లను 9 రోజుల్లోనే దాటేసింది’ అని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది.

కాగా రెండేళ్ల క్రితం ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన సిద్దు.. తర్వాతి మూడేళ్లలో తాను రూ. 100 కోట్ల సినిమా స్టార్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నాడు. అనుకున్నట్లే ఇప్పుడు తన కలను నిజం చేసుకున్నాడీ యంగ్ హీరో. ఇదే విషయాన్ని పోస్టర్ లో గుర్తుచేసింది సితార ఎంటర్ టైన్‌ మెంట్స్. టిల్లు స్క్వేర్ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో నేహా శెట్టి కూడా క్యామియో రోల్‍లో కనిపించారు. మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.