Family Star: ఆ రూల్ వస్తే తప్ప.. సినిమా మనుగడ సాగించలేదు.. దిల్ రాజు తీవ్ర ఆవేదన

Family Star: ఆ రూల్ వస్తే తప్ప.. సినిమా మనుగడ సాగించలేదు.. దిల్ రాజు తీవ్ర ఆవేదన

Ram Naramaneni

|

Updated on: Apr 07, 2024 | 4:15 PM

ఫ్యామిలీ స్టార్ మూవీపై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే..  సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారంటూ దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు.   నెగిటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు.  సినిమా ప్రేక్షక ఆదరణ పొందలేదంటే అందరూ ఆమోదించాల్సిందే అన్నారు.  కానీ మంచి సినిమాకు ప్రేక్షకులకు చేరువ కాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. 

ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి దిల్ రాజు స్వయంగా థియేటర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ప్రేక్షకుల నుంచి చాలా పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు. నెగిటివిటీని అడ్డుకోవాలని ప్రేక్షకులు సైతం కోరుతున్నట్టు తెలిపారాయన. కేరళలో ఫస్ట్ మూడు రోజులు రివ్యూ రేటింగ్స్ రాకుండా కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇక్కడ కూడా అలాంటి రూల్ ఏదైనా వస్తే తప్ప సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించలేదన్నారు దిల్‌రాజు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.