Siddu Jonnalagadda: సిద్ధుతో గొడవ.. సెట్ నుంచి వెళ్లిపోయిన అనుపమ.. అసలు విషయం చెప్పిన హీరో..
ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి.. రాధిక పాత్రలో నటించి మెప్పించగా.. సెకండ్ పార్ట్ లో మాత్రం ఆమె హీరోయిన్ కాదు. ఈసారి నేహాను కాకుండా.. అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
డీజే టిల్లు.. ఎలాంటి అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో హీరో సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజానికి ఈ చిత్రానికి ముందు సిద్ధూ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈచిత్రంలో సిద్ధూ.. నేహా శెట్టి యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం తర్వాత డీజే టిల్లు 2 ప్రకటించాడు. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి.. రాధిక పాత్రలో నటించి మెప్పించగా.. సెకండ్ పార్ట్ లో మాత్రం ఆమె హీరోయిన్ కాదు. ఈసారి నేహాను కాకుండా.. అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ముందుగా ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకుందని.. ఆ తర్వాత మరో హీరోయిన్ ను సెలక్ట్ చేయగా.. ఆమె కూడా నో చెప్పినట్లుగా టాక్ నడించింది. చివరకు ఈ సినిమా సెట్స్ నుంచి అనుపమ షేర్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే సెట్ లో అనుపమతో సిద్దూకు గొడవ జరిగిందని.. దీంతో ఆమె సెట్ నుంచి వెళ్లిపోయిందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇవే కాకుండా.. మొదటి పార్ట్ కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. దాని సిక్వెల్ కు రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో విమల్ కృష్ణకు సిద్ధూకు గొడవ జరిగిందని.. అందుకే అతడు సీక్వెల్ కు దర్శకత్వం వహించడం లేదని టాక్ నడిచింది. తాజాగా ఈ వివాదాలపై క్లారిటీ ఇచ్చారు సిద్దూ.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ మాట్లాడుతూ.. “నేను డీజే టిల్లు 2 ప్రకటించినప్పటి నుంచి మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు అప్రోచ్ అయ్యింది అనుపమనే. ఈ మూవీ గురించి ఎప్పుడూ మీటింగ్ పెట్టిన అది ఒక వార్త అవుతుంది. వాళ్లు వెళ్లిపోయారంట.. ఆ అమ్మాయికి వెళ్లిపోయింది అంటా అంటూ ఏవో వార్తలు వచ్చాయి. ఇక అనుపమ సెట్ లో నాతు గొడవ పడిందని రాసేసారు. ఇవన్ని చూసి నేను ఒక ట్వీట్ పెట్టాలనుకున్నాను.” అంటూ అనుపమతో గొడవ పై క్లారిటీ ఇచ్చాడు. అలాగే డైరెక్టర్ విమల కృష్ణతో జరిగిన గొడవపై క్లారిటీ ఇస్తూ.. లైవ్ లోనే అతడికి కాల్ చేశాడు సిద్దూ..