4 సినిమాలు చేస్తే.. నాలుగూ డిజాస్టర్లే.. ఇప్పుడు లాయర్‌గా బిజీ అయిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. కొంతమంది ఇతరభాషల్లో బిజీ అవుతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు..

హీరోయిన్స్ గా అవకాశాలు రావడమే కాదు.. స్టార్ డమ్ రావాలంటే అదృష్టం కూడా ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు నటనమీద ఆసక్తితో హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు.. కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ అయితే చాలా మంది సక్సెస్ కాలేక ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇంకొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోలేకపోతున్నారు. కొత్త కొత్త హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతానంటే కొంతమంది మాత్రం హిట్స్ కొట్టడానికే కాదు అవకాశాలు అందుకోవడానికి కూడా కష్టపడుతున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఇదే క్యాటగిరిలోకి వస్తుంది. అందం అభినయం ఉన్నా కూడా అవకాశాలు లేక సైలెంట్ అయ్యింది. ఆమె నటి మాత్రమే కాదు లాయర్ కూడా.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ నటి మాత్రమే కాదు న్యాయవాది కూడా.. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ మాళవిక శర్మ. ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే కానీ అభిమానులను మాత్రం తన అందాలతో కట్టిపడేసింది. మోడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది ఆతర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. హీరోయిన్ గానే కాకుండా న్యాయవాద వృత్తిని కూడా కొనసాగిస్తోంది.
రవితేజ హీరోగా నటించిన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా డిజాస్టర్ అయినా.. తన అందంతో కట్టిపడేసింది ఈ చిన్నది. ఆ తర్వాత రామ్ నటించిన రెడ్ సినిమాలో చేసింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. సుదీర్ బాబుతో హరోం హర, గోపీచంద్ తో భీమా సినిమాలు చేసింది. చేసిన ఈ నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి. అటు లాయర్ గా వృత్తి కొనసాగిస్తున్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పంచుకుంటుంది ఈ చిన్నది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
