AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్‌ కోహ్లీతో కలిసి వరల్డ్‌ కప్‌ గెలిచాడు! కట్‌ చేస్తే.. ఐపీఎల్‌ 2025లో అంపైర్‌గా..

తన్మయ్ శ్రీవాస్తవ, 2008 అండర్-19 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన క్రికెటర్, ఇప్పుడు IPL లో అంపైర్‌గా మారాడు. కోహ్లీ తో పాటు కీలక పాత్ర పోషించిన శ్రీవాస్తవ, ప్రొఫెషనల్ క్రికెట్‌ను వదిలి అంపైరింగ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ మార్పుపై అభిమానుల అభిప్రాయాలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విరాట్‌ కోహ్లీతో కలిసి వరల్డ్‌ కప్‌ గెలిచాడు! కట్‌ చేస్తే.. ఐపీఎల్‌ 2025లో అంపైర్‌గా..
Kohli Under 19 World Cup
SN Pasha
|

Updated on: Mar 19, 2025 | 12:27 PM

Share

టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎలాంటి హైట్స్‌కు చేరుకున్నాడో వివరించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అతనే ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌గా ఉన్నాడు. అయితే విరాట్‌ కోహ్లీ టీమిండియాలోకి రాకముందు కెప్టెన్‌గా అండర్‌19లో టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించాడు. ఆ టైమ్‌లో కోహ్లీ టీమ్‌లో ఉన్న ఓ ప్లేయర్‌ ఇప్పుడు అంపైర్‌గా మారాడు. అప్పట్లో కోహ్లీతో పోటీ పడి పరుగుల వరద పారించిన ఆ ఆటగాడు ఇప్పుడు కోహ్లీ, జడేజా ఆడుతున్న ఐపీఎల్‌లో పాపం అంపైర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్‌ ఎవరంటే.. తన్మయ్‌ శ్రీవాస్తవ.

ఈ మాజీ క్రికెటర్‌ 2008 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కీలకమైన 46 పరుగులు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో అతనే టాప్‌ స్కోరర్‌. భారత్ 45.4 ఓవర్లలో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయినా.. శ్రీవాస్తవ పోరాటం అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత టీమిండియాకు ఆడి, గొప్ప ప్లేయర్‌ అవుతాడని అంతా భావించినా.. అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. శ్రీవాస్తవ దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

అప్పటి నుంచి దేశీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు, BCCI అతన్ని IPLకి అంపైర్‌గా నియమించింది. ఈ నిర్ణయాన్ని ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. “నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వదిలి వెళ్ళడు – ఆటను మారుస్తాడు. అదే అభిరుచితో కొత్త టోపీని ధరించిన తన్మయ్ శ్రీవాస్తవకు శుభాకాంక్షలు!” అని UPCA వారి అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. మరి విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లతో కలిసి టీమిండియా అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ అందించిన ఆటగాడు ఐపీఎల్‌లో అంపైర్‌గా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్