Siddu Jonnalagadda: గొప్ప మనసు చాటుకున్న టిల్లన్న.. వరద బాధితుల కోసం సిద్దు జొన్నల గడ్డ భారీ విరాళం

|

Sep 03, 2024 | 3:48 PM

ప్రభుత్వాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నా వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా మంది సహాయం కోసం చేతులు ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు

Siddu Jonnalagadda: గొప్ప మనసు చాటుకున్న టిల్లన్న.. వరద బాధితుల కోసం సిద్దు జొన్నల గడ్డ  భారీ విరాళం
Siddu Jonnalagadda
Follow us on

భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు  భారీగా నష్టపోయాయి . ఈ వరదల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. మరీ ముఖ్యంగా విజయవాడలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నా వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా మంది సహాయం కోసం చేతులు ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. అలాగే విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు, వైజయంతీ మూవీస్ రూ. 25 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, చిన్నబాబు(రాధాకృష్ణ) సంయుక్తంగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్దు జొన్నల గడ్డ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి రూ. 15 లక్షల చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు విరాళం అందించాడు.

‘తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇలాంటి సమయాల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అత్యవసరం. వరద బాధితులకు నా వంతు సహకారంగా 30 లక్షల ఆర్థిక సహాయాన్ని (15 లక్షలు ఆంధ్రప్రదేశ్‌కి, 15 లక్షలు తెలంగాణకు) వరద సహాయనిధికి ప్రకటిస్తున్నాను. ఇది కొంత మందికి అయితే ఏదో ఒక విధంగా ఉపయోగపడుతోందని ఆశిస్తున్నాను’ అని హీరో సిద్దు జొన్నల గడ్డ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

సిద్దు జొన్నల గడ్డ పోస్ట్..

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు సిద్దు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు మరికొంతమంది హీరోలు ముందుకు రావాలని కోరుతున్నారు.

అదే బాటలో మరికొందరు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.