AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natural star Nani: నాని శ్యామ్ సింగరాయ్ కు అనుకోని కష్టం.. సినిమా సెట్ ను నీటముంచిన తుఫాన్..

పాపం నాని ఒకటి అనుకుంటే.. చివరికి మరోటి అయింది. నిర్మాతకు నష్టం కలగకూడదనుకున్నారు.. అందుకు తగ్గట్టే కోవిడ్‌ పీక్‌ టైంలోనూ కష్టపడ షూటింగ్ కెళ్లారు.

Natural star Nani: నాని శ్యామ్ సింగరాయ్ కు అనుకోని కష్టం.. సినిమా సెట్ ను నీటముంచిన తుఫాన్..
Rajeev Rayala
|

Updated on: May 22, 2021 | 7:02 PM

Share

Natural star Nani:

పాపం నాని ఒకటి అనుకుంటే.. చివరికి మరోటి అయింది. నిర్మాతకు నష్టం కలగకూడదనుకున్నారు.. అందుకు తగ్గట్టే కోవిడ్‌ పీక్‌ టైంలోనూ కష్టపడ షూటింగ్ కెళ్లారు. ఏదీ ఏమైనా షూటింగ్‌ ముగించాలని ఫిక్స్‌ అయ్యారు.. కాని ఏం లాభం అంత చేసినా.. నష్టం మాత్రం తప్పలేదు. ఇంతకీ అసలు విషయం ఏంటాఅని మీరందరు అనుకుంటున్నారు కదూ.. నానీ హీరోగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో..నీహారిక ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగ్ రాయ్’. కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా షూటింగ్‌లన్నీ ఆగిపోయినా.. మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ని మాత్రం ఆపలేదు ఈ మూవీ టీం. దీనికి కారణం ఈ సినిమా కోసం 6 కోట్ల ఖర్చుపెట్టి మరీ వేసిన “ఓల్డ్‌ కలకత్తా సిటీ” సెట్టు. అయితే కొన్ని రోజుల ముందు కరోనా సెకండ్‌ వేవ్ స్టార్ట్‌ అయి కేసులు వందల సంఖ్యలో నమోదు అవుతున్నా ఇండస్ట్రీలో షూటింగ్‌లన్నీ ఆగిపోతున్నా… నాని, డైరెక్టర్‌ రాహుల్ మాత్రం ఆ సెట్టు షెడ్యూల్‌ని ఫినిష్‌ చేసే పనిలో ఉన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేశారు.

సెట్ను ప్రవేట్ స్థలంలో నిర్మిచడం దానికి రోజు వారీ అద్దెను భారీగా చెల్లించాల్సి రావడంతో.. ప్రొడ్యూసర్ నష్టాల్లో కూరుకుపోకుండా.. నాని అప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. కాని కరోనా కేసులు ఇంకా పెరిగిపోవడం తెలంగాణ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ పెట్టేయండంతో.. చివరికి షూటింగ్‌ ని ఆపేయాల్సి వచ్చింది ఈ టీం . అయితే తాజాగా ఈ సెట్ కూలిపోయింది. వర్షం, ఈదురు గాలుల కారణం ఈ సెట్ లో కొంత భాగం నేలకొరిగింది. దీంతో నిర్మాత భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇంకా ఈ సెట్ నేపథ్యంలో కొన్ని సీన్లు, పాచ్‌ వర్క్‌లు మిగిలే ఉన్నాయి. ఇవి కూడా తొందర్లో షూట్‌ చేద్దామని ప్లాన్‌ చేసుకుంటున్న ఈ టీం ఆశలకు వరుణుడు గండి కొట్టారు. దీంతో నిర్మాత నష్టాల గురించి ఆలోచించి ఇంతదాకా లాక్కొచ్చిన నాని రిస్కు నీళ్ల పాలైంది. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bollywood: బాలీవుడ్ కు భారీ నాష్టాన్ని మిగిలిచిన వర్షాలు.. నీటిపాలైన సినిమా సెట్లు..

Hero varun Tej : ఆ యంగ్ హీరో నో అంటేనే ఆ సినిమా కథ వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్లిందట..