Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Family Man 2 Controversy: ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ట్రైలర్ కు కత్తెరేసిన అమెజాన్ ప్రైమ్..

తమిళుల దెబ్బకు అమెజాన్‌ ప్రైమ్ తోక ముడిచిందా..? తోక ముడవమే కాదు... ఫ్యామిలీ మ్యాన్‌ 2కు కత్తెరేయడం స్టార్ట్‌ చేసిందా..? అంటే అవుననే చెబుతున్నారు ఫిల్మ్ నగర్‌ వర్గాలు.

The Family Man 2 Controversy: 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' ట్రైలర్ కు కత్తెరేసిన అమెజాన్ ప్రైమ్..
Th Family Man 2
Follow us
Rajeev Rayala

|

Updated on: May 22, 2021 | 6:19 PM

The Family Man 2 Controversy: తమిళుల దెబ్బకు అమెజాన్‌ ప్రైమ్ తోక ముడిచిందా..? తోక ముడవమే కాదు… ఫ్యామిలీ మ్యాన్‌ 2కు కత్తెరేయడం స్టార్ట్‌ చేసిందా..? అంటే అవుననే చెబుతున్నారు ఫిల్మ్ నగర్‌ వర్గాలు. దానికి ఋజువుగా ఫ్యామిలీ మ్యాన్‌ 2 న్యూ ట్రైలర్‌ చూడండి అంటూ యూట్యూబ్ వంక చూపిస్తున్నారు. ఇంతకీ ఫ్యామిలీ మ్యాన్‌ న్యూ ట్రైలర్‌ ఏంటబ్బా అని అనుకుంటున్నారు కదూ..రాజ్, డికె డైరెక్షన్‌లో.. విజయవంతం అయిన ఫ్యామిలీ మ్యాన్‌ మొదటి సిరీస్‌కు సీక్వెల్గా తెరకెక్కిన సిరీస్‌ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2”. స్లీపర్‌ సెల్స్‌ నేపథ్యంలో సమంత, మనోజ్ బాజ్‌పేయి ఓ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ రీసెంట్‌గా యూట్యూబ్లో రిలీజ్‌ అయి కాంట్రవర్సీ అయింది. ఈ ట్రైలర్‌లో కొన్ని సీన్లు తమిళుల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని సోషల్ మీడియాలో తమిళులు విరుచుకుపడ్డారు. ఈ సిరీస్‌కి వ్యతిరేఖంగా “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్‌ ట్యాగ్‌ను కూడా వైరల్‌ చేశారు.

తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం దారుణం అని సోషల్ మీడియాలో కమెంట్ల వర్షం కురిపిచారు. శ్రీలంకలో తమిళ వాసుల కోసం పోరాడిన ఎల్‌ LTTE అసలు టెర్రరిస్ట్ సంస్థే కాదని, సామ్ తమిళ నటి అయ్యి కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికలపై కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు తమిళ తంబీలు. దీంతో దిగివచ్చిన ప్రైమ్… రీసెంట్‌గా రీఎడిట్ చేసిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో మళ్లీ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌లో సమంతకు సంబంధించిన కొన్ని సీన్లకు కత్తరేసి తమిళ తంబీలను శాంతింపజేసేందుకు ట్రై చేసింది. ఇదంతా చూస్తుంటే సిరీస్‌లోనూ.. సమంత క్యారెక్టర్‌కు భారీగా కత్తెర పడడం ఖాయంగా కనిపిస్తుందంటూ.. సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Singer Madhu Priya : సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. కారణం ఇదే..

Trivikram and Mahesh: మహేష్ ను మరింత స్టైలిష్ గా చూపించనున్న మాటల మాంత్రికుడు..