Shruti Haasan: మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ గా మారిన శ్రుతిహాసన్.. అమ్మడు ఎంట్రీ ఇస్తే హిట్టేనట
బాలయ్య వీరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ చిన్నది. రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది.
అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది. బడా హీరోల సరసన దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ చిన్నది. రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రుతి సలార్ సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రుతి ని మెగా ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే..
శ్రుతి హాసన్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా మెగా ఫ్యామిలి హీరోలతో సినిమాలు చేస్తూ.. సూపర్ హిట్స్ అందుకుంది. శ్రుతిహాసన్ కు మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎవడు సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య కూడా మంచి హిట్ అవ్వడంతో శ్రుతి మెగా ఫ్యామిలీ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.