Shruthi Haasan: శ్రుతీహాసన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. గోత్ థీమ్‌తో సరికొత్తగా.. ఫోటోస్ వైరల్..

|

Dec 25, 2024 | 3:14 PM

టాలీవుడ్ సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు శ్రుతిహాసన్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరగా సలార్ మూవీలో కనిపించిన శ్రుతిహాసన్... ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఈ బ్యూటీ చివరిసారిగా సలార్ చిత్రంలో కనిపించింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Shruthi Haasan: శ్రుతీహాసన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. గోత్ థీమ్‌తో సరికొత్తగా.. ఫోటోస్ వైరల్..
Shruthi Haasan
Follow us on

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ శ్రుతీ హాస‌న్ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యింది. తాజాగా క్రిస్మ‌స్ సీజ‌న్‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి సిద్ధ‌మైంది ఈ అమ్మడు. ఈ సెల‌బ్రేష‌న్స్ ద్వారా కొత్త సంవ‌త్స‌రాదిని స‌రికొత్త ఉత్సుక‌త‌లో ప్రారంభించ‌టానికి ఆమె అడుగులు వేస్తున్నారు. క్రిస్మ‌స్ పండుగ‌ను శ్రుతీ హాస‌న్ త‌న‌దైన శైలిలో జ‌రుపుకోవ‌టానికి సెల‌బ్రేష‌న్స్‌ను మొద‌లు పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా శ్రుతి గోత్ థీమ్‌తో క్రిస్మ‌స్‌ ఫెస్టివల్ ను తన స్టైల్లో సెల‌బ్రేట్ చేయ‌టానికి రెడీ అయ్యింది.

శ్రుతీ హాస‌న్, త‌న‌దైన స్టైల్లో యూనిక్‌గా నిర్వ‌హిస్తోన్న‌ క్రిస్మ‌స్ పండుగ వేడుక‌లకు సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌త్యేక‌మైన శైలిలో హాలీడే సీజ‌న్‌కు స్వాగ‌తం ప‌లుకుతూ ఆమె అభిమానులు స‌హా అందిర‌లోనూ ఆనందాన్ని నింపింది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే 2023 శ్రుతీ హాస‌న్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ ఏడాదిగా చెప్పొచ్చు. వాల్తేరు వీర‌య్య, వీర సింహారెడ్డి, స‌లార్ పార్ట్ 1 చిత్రాలు విడుద‌లై ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఆమె న‌టించిన సినిమాలేవీ విడుద‌ల కాలేదు. అయితే అభిమానులు మాత్రం 2025లో స‌రికొత్త చిత్రాల్లో ఆమెను మరింత కొత్తగా చూడొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ కూలీ వ‌చ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో రూపొంద‌నున్న స‌లార్ 2 చిత్రం కూడా వ‌చ్చే ఏడాదిలో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం.

ఇవి కాకుండా మ‌రిన్ని క్రేజీ చిత్రాల్లో శ్రుతీ హాస‌న్ ప్రేక్షకుల‌ను అల‌రించ‌టానికి సిద్ధమ‌వుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో అభిమానులు స‌హా ప్రేక్షకుల‌ను మెప్పించ‌నున్నారు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.