S. S. Rajamouli: జక్కన్న డెడికేషన్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన హీరోయిన్ శ్రియ..
ప్రపంచం మొత్తం రాజమౌళి పై ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించిన శ్రియ కూడా జక్కన్న పై పొగడ్తల వర్షం కురిపించింది అలాగే ఈ సినిమా షూటింగ్ లోని అనుభవాలను పంచుకుంది ఏ ముద్దుగుమ్మ.

దేశం తిరస్కరించినా.. తానే పూనుకుని తన సినిమాను ఆస్కార్ వేటలో నిలబెట్టింది జక్కన్న టీమ్. ఎత్తర జెండా అంటూ 14 కేటగిరీల్లో అప్లయ్ చేస్తే ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి మాత్రమే నామినేషన్ దొరికింది. ఆవిధంగా ఆస్కార్ రేసులో నిలబడింది నాటునాటు పాట. ఎకాడమీ అవార్డ్స్ కోసం ఈసారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81 పాటలు ఎలిజిబిలిటీ సాధించాయి. వాటిని గట్టిగా జల్లెడ పడితే ఫస్ట్ రౌండ్‌లో 15 పాటలు మిగిలాయి. ఆ తర్వాత రౌండ్‌లో పది పాటలు పక్కకెళ్లిపోయి.. ఫైనల్ రేసులో టాప్ ఫైవ్ ఒరిజినల్ సాంగ్స్ మిగిలాయి. మిగిలిన నాలుగు అమెరికన్ సాంగ్స్ తో పోటీపడింది మన నాటు పాట. ఇక సింగర్స్ విషయానికొస్తే రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే కాదు, కాలభైరవ పెర్ఫార్మెన్స్ కూడా కేకన్నారు జనాలు. ఒకరికొకరు స్క్రీన్ మీద హీరోలు ఎంత పోటీపడి డ్యాన్సులు చేశారో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇద్దరు యంగ్ సింగర్స్ కూడా తమ స్టామినాను అదే రేంజ్‌లో చూపించారంటూ ప్రశంసల వర్షం కురిసింది.
ఇక ప్రపంచం మొత్తం రాజమౌళి పై ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించిన శ్రియ కూడా జక్కన్న పై పొగడ్తల వర్షం కురిపించింది అలాగే ఈ సినిమా షూటింగ్ లోని అనుభవాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
శ్రియ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాత్ర కోసం నన్ను పిలవగానే నేను ఓకే చెప్పేశా.. దానికి కారణం రాజమౌళి. ఈ సినిమాలో మీది చిన్న పాత్రే అయినా చాలా ఇంపార్టెంట్ రోలో అని చెప్పగానే నేను ఓకే నేను చేస్తాను అని అన్నాను. నేను సెట్ కు వెళ్ళినప్పుడు అది మొత్తం విలేజ్ సెటప్ లో ఉంది. సినిమాలో నా కొడుకును చంపేస్తారు. నేను వెనక్కి తిరగ్గానే నన్ను కూడా కాల్చేస్తారు నేను చనిపోవాలి. ఆ సమయంలోనే నా కళ్ళలో బాధ, నిస్సహాయత కనిపించాలి. ఆ సీన్ ను రాజమౌళి నాకు వివరించే టప్పుడు.. అప్పుడే అర్ధమైంది ఈ సీన్లో ఎంత డెప్త్ ఉంటుందో.. అలాగే ఆయన చెప్పినట్టే చేశాను. ఆ సీన్ సినిమాలో అద్భుతంగా పండింది అన్నారు శ్రియ
నేను రాజమౌళితో రెండు సినిమాల్లో పనిచేశాను. 2005లో ఛత్రపతి సినిమాలో నటించాను. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో నటించాను. అప్పటికి ఇప్పటికి ఆయనలో ఏం మార్పు రాలేదు. ఆయన డెడికేషన్ మాములుగా ఉండదు. ఒక సీన్ షూట్ చేయాలంటే ఆయన తన అసిస్టెంట్ డైరెక్టర్స్ తో ఆ సీన్ పై చాలా సార్లు పని చేస్తారు. మార్నింగ్ షూట్ కు రాగానే తనకు ఏమ్ కావాలో.. ఎలా కావాలో చేసి చూపించి మాతో చేయించుకుంటారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ పాత్రలు సినిమాలు ఎలా ఉపయోగపడతాయో.. అందుకే ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ఆస్కార్ వరకు చేరుకున్నారు అని చెప్పుకొచ్చింది శ్రియ



