AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పటికీ ఆ కోరిక తీరలేదు.. 25ఏళ్లుగా ఎదురుచూస్తున్నా..! హాట్ బ్యూటీ క్రేజీ కామెంట్స్

తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ ఆమె. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సినిమాల్లో సహయ నటిగా కొనసాగుతుంది. అలాగే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.

ఇప్పటికీ ఆ కోరిక తీరలేదు.. 25ఏళ్లుగా ఎదురుచూస్తున్నా..! హాట్ బ్యూటీ క్రేజీ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2026 | 10:20 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్.. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అలానే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పాపులర్ అయ్యింది ఆ అందాల  తార. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది. కెరీర్ మొదలు పెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన నటించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల సరసన నటించింది. అయితే 25ఏళ్లుగా ఆమెకు ఓ తీరని కోరిక ఉందని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆమె కోరిక ఏంటో చూద్దాం.!

ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్

దక్షిణాది సినిమా ప్రపంచంలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో శ్రియ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి తనకంటూ మంచి పేరు తెచ్చుకుంది. అందం, అభినయంతోపాటు కథక్ డ్యాన్సర్ గానూ శ్రియ ఫేమస్. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా దూసుకుపోతుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన శ్రియ.. ఇప్పుడు మాత్రం అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా కనిపించేందుకు రెడీగా ఉంటుంది. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సినిమాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..

పెళ్లి చేసుకున్నా కూడా ఈ అమ్మడు సినిమాలకు దూరం అవ్వలేదు. పెళ్ళైన కూడా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అంతే కాదు కూతురు పెట్టినా కూడా తరగని అందంతో కుర్ర హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.తనకు ఓ ఓ కిరాక మిగిలిపోయిందని తెలిపింది. తనకు డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కాగా తనకు ఏదైనా డ్రీమ్ రూల్ ఉందా.? అని ప్రశ్నించగా.. తనకు నాట్య కళాకారిణి పాత్రలో నటించాలనే కోరిక చాలా ఏళ్లుగా ఉండిపోయిందన్నారు. ఓ నాట్యకళాకారిణి జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో చూపించే సినిమాలో నటించాలని ఉందని తెలిపింది. అలాంటి పాత్ర కోసం 25ఏళ్లుగా ఎదురుచూస్తున్నా అని తెలిపింది శ్రియ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.