AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెపోటు కంటే ముందు అంత ఘోరం జరిగిందా? డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి మృతిలో షాకింగ్‌ ట్విస్ట్‌

మూర్తి గుండెపోటుతో కన్నుమూశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ విషయంలో షాకింగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మరణానికి ముందు శ్రీనివాసమూర్తి తన నివాసం రెండో అంతస్తు మీద నుంచి ప్రమాదవశాత్తూ కిందపడినట్లు తెలుస్తోంది. కిందపడిన వెంటనే ఆయన హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యారట.

గుండెపోటు కంటే ముందు అంత ఘోరం జరిగిందా? డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి మృతిలో షాకింగ్‌ ట్విస్ట్‌
Srinivasa Murthy
Basha Shek
|

Updated on: Jan 28, 2023 | 6:17 PM

Share

తన గంభీరమైన వాయిస్ తో స్టార్‌ హీరోల సినిమాలకు ప్రాణం పోసిన ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది. చెన్నైలోని తన సృగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. కాగా మూర్తి గుండెపోటుతో కన్నుమూశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ విషయంలో షాకింగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మరణానికి ముందు శ్రీనివాసమూర్తి తన నివాసం రెండో అంతస్తు మీద నుంచి ప్రమాదవశాత్తూ కిందపడినట్లు తెలుస్తోంది. కిందపడిన వెంటనే ఆయన హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యారట. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆయనును వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మూర్తి ఆరోగ్యం బాగా విషమించిందట. దీంతో వైద్యులు వైద్యులు ఆయనకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే దురదృష్టవశాత్తూ వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా దాదాపు 2వేలకు పైగా చిత్రాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ముఖ్యంగా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను దక్షిణాది ప్రాంతీయ భాషల్లోకి, తెలుగులోకి అనువదించడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. హృతిక్‌ రోషన్‌, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టార్‌ హీరోలకు తన గొంతును అరువిచ్చారాయన.

కాగా శ్రీనివాస మూర్తిపై పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆమర మరణం నాకు వ్యక్తిగతంగా ఎంతో నష్టాన్ని, బాధను కలిగిస్తుంది.. తెలుగులో నాకు ఇంతటి ప్రేమ దక్కడానికి కారణం ఆయనే. ఆయన గొంతు, ఎమోషన్స్‌ నా పాత్రలకు ప్రాణం పోశాయి. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను సర్.. మీరు చాలా త్వరగా వెళ్లిపోయారు అంటూ ఎమోషనల్ అయ్యాడు సూర్య. ఆయన నటించిన సింగం, సింగమ్‌ 2, సింగం 3, రాక్షసుడు, 24, వీడొక్కడే, ఆరు, నువ్వు నేను ప్రేమ తదితర సినిమాలకు మూర్తి డబ్బింగ్‌ చెప్పారు. ఇక హృతిక్‌ క్రిష్‌, క్రిష్‌ 3, కాబిల్‌, బ్యాంగ్‌బ్యాంగ్‌, ధూమ్‌ 2 సినిమాలకు ఆయన డబ్బింగ్‌ చెప్పారు. ఈ క్రమంలో మూర్తి మరణంపై స్పందించిడు బాలీవుడ్ గ్రీక్‌ హీరో .. ‘మీ ఆత్మకు శాంతి కలగాలి. మీ గొంతు నన్ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యేలా చేసింది. సినిమా విషయంలో నేను మిమ్మల్ని బాగా మిస్సవుతాను’ అని సంతాపం తెలిపారు హృతిక్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..