మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ ప్రకటించారు. ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 3 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. రేపటి నుంచి జనవరి 30 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంటుంది. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 16న మేయర్, చైర్‌పర్సన్‌ల ఎన్నికతో ముగుస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
టోల్‌గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
కాకినాడలో భారీ స్కామ్..ఏకంగా కోట్ల విలువ చేసే..
ఇంకో అడుగు ముందుకెళితే అంతే
టోల్‌గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ముక్కామల కళాకారులు

