Shiva Shankar Master Death: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Shiva Shankar Master Death: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..
Shiva Shankar Master

Edited By: Ram Naramaneni

Updated on: Nov 29, 2021 | 11:02 AM

Shiva Shankar Master Deth: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మహా ప్రస్థానంలో శివశంకర్‌ మాస్టర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం పంచవటి కాలనీలోని ఆయన ఇంటికి చేరుకుంది శివశంకర్‌ మాస్టర్‌ భౌతికకాయం. కొద్ది రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివశింకర్‌ మాస్టర్‌ నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఐతే ఆయన చనిపోయే సమయానికి కొవిడ్‌ నెగెటివ్‌గా నిర్థారించింది AIG హాస్పిటల్‌.

శివశంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ మాట్లాడుతూ.. ఆయన అస్వస్థతకు గురైన సమయంలో ఎందరో సినీ పెద్దలు, రాజకీయ నాయకులు, అభిమానులు.. మాకు అండగా నిలిచారు.. మెగాస్టార్ చిరంజీవి, లారెన్స్ మాస్టర్, హీరో ధనుష్, సోను సూద్, జానీ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు, తమిళనాడు హెల్త్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం.. మొదలగు ఎందరో పెద్దలు మాకు అండగా నిలిచారు. వందల మంది అభిమానులు మాకు ఫోన్ చేసి పరామర్శించారు.. వారందరికీ పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్‌ మాస్టర్‌.. చెన్నైలో పుట్టారు. సలీమ్‌ మాస్టర్‌ దగ్గర శిష్యరికం చేశారు. 800 చిత్రాలకు పైగా డ్యాన్స్‌ మాస్టర్‌గా చేశారు శివశంకర్‌. 30చిత్రాల్లో నటించారు కూడా. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో..

Rashmika: అందాల రష్మిక మోటివేషనల్‌ పోస్ట్‌.. భయాన్ని ఎలా జయించాలో ఎంత బాగా చెప్పిందే చూడండి..

Shivani Rajashekar: చీరకట్టులో ‘అద్భుతం’గా అందాల తార.. శివాని రాజశేఖర్‌ లేటెస్ట్‌ ఫోటోలు చూశారా.?