
యంగ్ హీరో శర్వానంద్(Sharwanand)హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు ఈ వర్సటైల్ యాకర్. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం శర్వా నటిస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ, అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగు లో అడుగుపెడుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా శర్వాంద్ మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం మనసుని హత్తుకునే సినిమా. ఈ సినిమా చుసిన తర్వాత ఇందులో వుండే పాత్రలతో రిలేట్ అవుతాం. కార్తిక్ ఇందులో గొప్ప విషయం చెప్పాడు అన్నారు. నిన్నటి బాధ, రేపటి ఆశ తో బ్రతుకుతుంటాం. కానీ ఈ క్షణాన్ని గుర్తించం. అది గుర్తించినపుడు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ . అందుకే ఒకే ఒక జీవితం టైటిల్ పెట్టాం. ఒకే ఒక జీవితం మంచి వినోదాత్మక చిత్రం. మదర్ ఎమోషన్ తో పాటు మంచి వినోదం ఇందులో వుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ పాడిన హీరో కార్తి అన్నకి థాంక్స్. ఒక హీరోకి, సినిమాకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ట్రైలర్ ని పోస్ట్ చేసిన ప్రభాస్ అన్నకి కృతజ్ఞతలు. అలాగే ట్రైలర్ ని లాంచ్ చేసిన అనిరుద్ కు థాంక్స్” అని అన్నారు. మరి ఈ సినిమా శర్వాకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..